శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా (‘Kubera’ movie) విడుదల తేదీ దగ్గరపడుతోంది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో దుమ్మురేపుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ ట్రైలర్‌లో డబ్బు, పవర్ చుట్టూ తిరిగే కథాంశం స్పష్టంగా కనిపించింది.
పాత్రల డైలాగులు ఇంటెన్సిటీ పెంచేశాయి
ధనుష్ (Dhanush) చెప్పిన “కోట్లు కోట్లు అంటే ఎంత సార్?” అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌లో నాగార్జున, విలన్ల డైలాగ్స్ కూడా బలంగా నిలిచాయి. “ఈ దేశంలో డబ్బు, పవర్ పని చేస్తాయి.. నీతి కాదు!” అని నాగార్జున చెప్పే సన్నివేశం సినిమాకు కొత్త కోణం చూపించింది.ధనుష్ పాత్ర పరిచయం కొత్తగా ఉంది. బిచ్చగాడిగా మొదలై ముష్టివాడిగా మారే మార్పు ఆకట్టుకుంది. “నా పేరు దీపక్” అని నాగార్జునతో పరిచయం, “మేడం మీరు తప్ప నాకు ఎవరూ లేరు” అనే భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పెంచింది.
శేఖర్ కమ్ముల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్?
ఇప్పటి వరకు ప్రేమ, భావోద్వేగాలకు పెద్దపీట వేసిన శేఖర్ కమ్ముల, ఈసారి మాత్రం కథని పూర్తిగా సస్పెన్స్ కోణంలో నడిపినట్లు ట్రైలర్ చెబుతోంది. విజువల్స్ పక్కాగా ఉండగా, ఫ్రేములన్నీ ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి.‘కుబేర’ సినిమా తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. హై బడ్జెట్‌తో, అద్భుతమైన టెక్నికల్ విలువలతో సినిమా తెరకెక్కింది.