Haryana elections. Parole of Dera Baba once again

హర్యానా ఎన్నికలు.. డేరా బాబాకు మరోసారి పెరోల్‌

Haryana elections.. Parole of Dera Baba once again

న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్‌ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. ఎన్నికల సంఘం ఆమోదం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

డేరా బాబాకు హర్యానాలో లక్షలాది మంది అనుచరులున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఈ ఎన్నికలపై పెను ప్రభావం పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పెరోల్‌ సమయంలో ఆయన హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా లేదా సోషల్‌ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే వీలుండదని సమాచారం. కాగా, ఎన్నికల సంఘం నిర్ణయంతో డేరా బాబాకు తొమ్మిది నెలల్లో పెరోల్‌ లభించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక గత నాలుగేళ్లలో 15వ సారి.

Related Posts
యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన మోడీ
narendra modi

భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ Read more

Baba Siddique Murder: బాబా సిద్ధిఖీని చంపింది మేమే… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
baba siddique

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దుశ్చర్య మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా Read more

మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం
fire accident mahakumbh mel

మహాకుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో, సెక్టార్ 22లో ఈ ప్రమాదం సంభవించింది. టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే, Read more

మంటల్లో దగ్ధమైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు
Diwakar travels bus caught fire in anantapur

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో Read more