Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హతలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షా టూర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కేడర్‌కు పిలుపునిస్తున్నట్లు షర్మిల ఎక్స్ వేదికగా షర్మిల రాసుకొచ్చారు.

image
Amit Shah is not eligible to enter Andhra: Sharmila

అంబేద్కర్‌పై చేసిన అనుచతి వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలెఉ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడమంటే దేశ ద్రోహంతో సమానమని.. నిండు సభలో అంబేద్కర్‌ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని షర్మిల ఆరోపించారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసే వాళ్లుఎ కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్టేనన్నారు షర్మిల.

అమిత్ షాతో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని.. కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని షర్మిల రాసుకొచ్చారు.

Related Posts
ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్
imd warns heavy rains in ap and tamil nadu next four days

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుఫాన్ గడిచిన 6గంటల్లో 10 కిమీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో Read more

వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు
వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు

డబ్బుకోసం పట్టపగలే ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసి కారులో చిత్రహింసలు పెట్టిన కేసులో వైసీపీ కౌన్సిలర్‌, మరొక వ్యక్తిని పోలీసులు అరె్‌స్టచేశారు. ఈ నెల 5వ తేదీనగుంటూరు Read more

అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం: కేంద్రం స్పష్టం
jaishankar

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అక్రమ వలసదారులపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దీనిపై ఓ ప్రకటనను Read more

దిల్ రాజు ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ రైడ్స్
it rides dil raju

టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ Read more