Haryana elections. Parole of Dera Baba once again

హర్యానా ఎన్నికలు.. డేరా బాబాకు మరోసారి పెరోల్‌

Haryana elections.. Parole of Dera Baba once again

న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్‌ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. ఎన్నికల సంఘం ఆమోదం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

డేరా బాబాకు హర్యానాలో లక్షలాది మంది అనుచరులున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఈ ఎన్నికలపై పెను ప్రభావం పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పెరోల్‌ సమయంలో ఆయన హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా లేదా సోషల్‌ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే వీలుండదని సమాచారం. కాగా, ఎన్నికల సంఘం నిర్ణయంతో డేరా బాబాకు తొమ్మిది నెలల్లో పెరోల్‌ లభించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక గత నాలుగేళ్లలో 15వ సారి.

Related Posts
భారత ఆర్ధికవృద్ధిపై ప్రశంసలు కురిపించిన అధ్యక్షుడు పుతిన్‌
President Putin praised Indias economic growth

న్యూఢిల్లీ: రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ఆర్థిక Read more

వరదలతో చెన్నై అతలాకుతలం..
chennai flood

చెన్నై నగరాన్ని భారీ వర్షాలు , వరదలు వదలడం లేదు. ప్రతి ఏటా ఇలాంటి వర్షాలు , వరదలకు అలవాటుపడిపోయిన జనాలు చిన్న వర్షం పడగానే ముందుగానే Read more

శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్
శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటనపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ల Read more

విజయవంతంగా వందే భారత్‌ ట్రయల్‌ రన్‌
vande bharath new sleeper train

భారతీయ రైల్వేస్ లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్‌ ట్రెయిన్‌ను విజయవంతంగా Read more