Harish Rao కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన

Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన

హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములు మరోసారి వార్తల్లోకి వచ్చాయి ఈ ప్రాంతంలో అరుదైన వృక్షాలు, పక్షులు, జంతువులు ఉన్నాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తెలిపారు.ఇక్కడ ఉన్న 400 ఎకరాల భూమి పరిశీలనకు కేంద్ర సాధికారిక కమిటీ, పర్యావరణ, అటవీశాఖలు, హెచ్‌సీయూ బృందం ఇటీవలే పరిశీలన చేపట్టింది. కమిటీ సభ్యులతో బీఆర్‌ఎస్ నేతలు సమావేశమై నివేదికను అందజేశారు.ఈ భూముల్లో ఉన్న జీవవైవిధ్యం గురించి డాక్యుమెంట్లు, ఫోటోలు, వివరాలతో కూడిన డేటాను బీఆర్‌ఎస్ కమిటీ సమర్పించింది.

Advertisements
Harish Rao కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన
Harish Rao కంచ గచ్చిబౌలి భూములపై హరీశ్ రావు ఆందోళన

భవిష్యత్తులో అభివృద్ధి పేరుతో వన్యప్రాణులు, వృక్షజాలం నష్టపోకూడదని హరీశ్ స్పష్టం చేశారు.తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరకాలంటే ముందస్తు అనుమతి అవసరమని ఆయన గుర్తుచేశారు.అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు తొలగించరాదని చెప్పారుప్రతి చెట్టుకు రూ. 400 డిపాజిట్ అవసరమని, ఆ ప్రక్రియ లేకుండానే నరకడం దురదృష్టకరమన్నారు.అటవీశాఖ నిర్లక్ష్యం వల్లే ఇక్కడ చెట్లు కట్ చేశారని విమర్శించారు.2011లో జీహెచ్ఎంసీ లక్ష మొక్కలు నాటినట్టుగా ఆయన గుర్తుచేశారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ కూడా మొక్కలు నాటినట్టు తెలిపారు. ఇక్కడి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యతగా పరిగణించాలని కోరారు.కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి గతేడాది రూ. 10 వేల కోట్లు రుణంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ రుణాలకోసం మధ్యవర్తికి రూ. 170 కోట్లు చెల్లించారని, అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని తాము లేవనెత్తినట్టు చెప్పారు.ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందినవేనని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఫార్మా సిటీ కోసం ఇప్పటికే ప్రభుత్వం 14 వేల ఎకరాలు సేకరించిందని చెప్పారు.ఆ భూమిని అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి నాశనం కాకుండా చూడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హరీశ్ కోరారు.

Related Posts
మరోసారి ఆర్బీఐ కీలక నిర్ణయం..అందుకోసమేనటా..!
Once again, RBI key decision..what is the reason.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు మరోసారి చర్యలను ప్రకటించింది. Read more

బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్
mahesh kumar

తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ను పాకిస్థాన్ క్రికెట్ Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పై స్పందించిన ప్రశాంత్ కిశోర్..
Prashant Kishor reaction on AAP defeat..

అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందన్న పీకే న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. Read more

అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది – ట్రంప్
trump

అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, తమ దేశ సైన్యాన్ని ప్రపంచంలో ఎవరూ ఊహించలేని విధంగా పునర్నిర్మాణం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×