Harish Rao Questions CM Revanth Reddy

ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే : హరీశ్ రావు ట్వీట్

రేవంత్ రెడ్డి ఈ రైతుకు ఏం జవాబిస్తారు?

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఓ రైతు నిరసనకు దిగిన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ‘అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరికి ఏం సమాధానం చెబుతారు.

 

ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే..

మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నారు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే పాపపరిహారం చేసుకోండి. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు..అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఈరోజు గాంధీ భవన్ దాకా వచ్చిన వారు,రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాక వస్తరు.

హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలి

ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు. అధికారులను వేడుకున్నడు. అయినా, వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి గారి పట్టుదలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం అని హరీశ్ రావు రాసుకొచ్చారు.

Related Posts
మెట్ పల్లిలో విషాదం..పెళ్ళికొడుకు ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలో విషాదం: పెళ్లి రోజునే వరుడు ఉరివేసుకున్నాడు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రాంచంద్రంపేట గ్రామంలో పెళ్లి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు లక్కంపల్లి కిరణ్ (37) పెళ్లి రోజునకే ముందు రాత్రి Read more

పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే : అంబటి
If Pawan wants to be CM, he has to go to Goa .. Ambati

పవన్ కు కౌంటర్ ఇచ్చిన అంబంటి రాంబాబు అమరావతి: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందేనని మాజీ మంత్రి, వైసీపీ నేత సెటైర్లు విసిరారు. జగన్ Read more

ఇజ్రాయెల్ – హెజ్‌బొల్లా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..
Israel Hezbollah 1

ఇజ్రాయెల్  రక్షణ బలగాలు గురువారం సౌత్ లెబనాన్‌లోని ఆరు ప్రాంతాలకు ట్యాంకు కాల్పులు జరిపాయి. ఇజ్రాయెల్  సైన్యం, హెజ్‌బోల్లాతో ఉన్న యుద్ధవిరామం ఉల్లంఘించబడినట్టు తెలిపింది. ఈ ఘటనలో, Read more

తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? – ఎమ్మెల్సీ కవిత
kavitha telangana thalli

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం పై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని, Read more