Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్న ఈ కాలంలో, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. గజ్వేల్ పట్టణంలోని శోభా గార్డెన్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ముందు నాయకులతో సమావేశమై మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Advertisements

కాంగ్రెస్ ప్రభుత్వం – స్పీడ్‌లో వచ్చిన పాలన, స్పీడ్‌లో వెళ్ళిన విశ్వాసం

హరీశ్ రావు వ్యాఖ్యానంలో ప్రధానంగా నిలిచింది ఒక్క మాట – ఎంత స్పీడ్‌గా గెలిచారో.. అంతే స్పీడ్‌గా ఓడిపోయారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, తక్కువ కాలంలోనే వ్యాపారాలు, వ్యవస్థలు నెమ్మదించిపోయాయని విమర్శించారు.

హరీశ్ రావు ఆరోపణలు

హరీశ్ రావు చేసిన కొన్ని ముఖ్యమైన ఆరోపణలు-రేవంత్ రెడ్డి పాల‌న‌లో వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదు. ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదు అంటున్నారు. రేవంత్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. ఒక మండలంలో చూస్తే 5,100 మందికి రుణమాఫీ అయితే 7,300 మందికి రుణ మాఫీ కాలేదు. గజ్వేల్‌లో ప్రతి కులానికి ఏదో విధంగా బీఆర్ఎస్ పాలనలో న్యాయం చేశామ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్‌కు లాభం అవుతుంది. నాయకులు సమావేశానికి కార్లలో కాకుండా కార్యకర్తలతో బస్సులో రావాలి. సభకు వచ్చిన కార్యకర్తలను ఇంటికి చేర్చే వరకు నాయకులు జాగ్రత్త తీసుకోవాలి. మహిళా నాయకులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. వచ్చిన ప్రతి కార్యకర్త సభకు హాజరుకావాల్సిందే. నాయకులు మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. నాయకులు పనిచేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో మనమే గెలుస్తాం. గజ్వేల్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు గెలుస్తాం అని హ‌రీశ్‌రావు ధీమా వ్య‌క్తం చేశారు.

రైతుల సమస్యలు, బియ్యం నాణ్యతపై ఆగ్రహం

సన్న బియ్యంలో నూకలు ఎక్కువ: గ్రామాలలో సన్న బియ్యం ఇస్తున్నారు అందులో 40 శాతం నూకలే. నూకలు లేకుండా గురుకులాలకు ఏ విధంగా కేసీఆర్ సన్న బియ్యం ఇచ్చారో అదే విధంగా ఇవ్వండి. వడ్లు కొనమని అడిగితే నూకలు బుక్కండి అన్నది బిజెపి ప్రభుత్వం. నూకలు ఉన్న బియ్యం ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. 14 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణ మాఫీ చేసిండు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కాలంలో కూడా రైతు బంధు ఇచ్చాడు. కాంట్రాక్టర్ లకు బిల్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నేడు కాంట్రాక్టర్ లను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గెలిపించుకుందాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు
రైతులు చెట్లు నరికితే కేసులు పెడతారు. మరి 400 ఎకరాలలో చెట్లు నరికితే రేవంత్ రెడ్డిపై కేసు పెట్టరా. 170 కోట్ల లంచం ఇచ్చి అప్పులు తెచ్చింది రేవంత్ రెడ్డి. 400 ఎకరాల భూమి కుదవ పెట్టి 10 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అడిగితే కుదవ పెట్టలేదు అంటున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లికేషన్ పెట్టాన‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Read also: Saleshwaram Jatara: సలేశ్వరం జాతరకు భక్తుల సందడి..6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

Related Posts
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

అల్లాదుర్గం( ప్రభాతవార్త) మార్చి 4. అల్లాదుర్గం మండలంలోని చిల్వర్ సమీపంలోని 161 జాతీయ రహదారిపై కారు ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం చెందారు. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం Read more

బిఆర్ఎస్ లోనే ఉన్న అంటూ గద్వాల్ ఎమ్మెల్యే క్లారిటీ
Gadwal MLA Bandla Krishna M

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీ మార్పు గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నాను అని స్పష్టం చేశారు. కొందరు తనను Read more

Saleshwaram Jatara: సలేశ్వరం జాతరకు భక్తుల సందడి..6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్
Saleshwaram Jatara: సలేశ్వరం జాతరకు భక్తుల సందడి..6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సలేశ్వరం జాతరకు ఈసారి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిపే ఈ జాతర, నల్లమల అటవీ ప్రాంతంలోని Read more

రియల్టర్ దారుణ హత్య ఎక్కడంటే?
రియల్టర్ దారుణ హత్య ఎక్కడంటే?

హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్రంగా కుదిపేసింది. చున్నీతో చేతులు, కాళ్లు కట్టేసి, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×