Harish Kumar Gupta is the new DGP of AP

ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు

అమరావతి: ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.

Advertisements

ఆయన పదవీకాలం నేటితో ముగిసింది. ఇవాళ ఆయనకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తి మేర పని చేస్తానని అన్నారు.

కాగా, ఏపీ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా బాధ్యతలు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌.. డీజీపీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు జనవరి 31న పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం అనివార్యం కాగా.. హరీష్‌కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్ గుప్తా.. ప్రస్తుతం ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు.

Related Posts
Solar Eclipse: ఏ ఏ దేశాల్లో సూర్యగ్రహణం?
Solar Eclipse: 2025 తొలి సూర్యగ్రహణం - ఏ దేశాల్లో కనిపిస్తుంది?

కొత్త ఏడాది ప్రారంభంలోనే ఖగోళ ప్రియులకు ఆసక్తికరమైన సంఘటన జరగబోతోంది. 2025లో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహణం Read more

జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు.. పోలీసుల విచారణకు రాజ్‌పాకల
Janwada farmhouse case. Raj Pakala to police investigation

హైదరాబాద్‌: జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఈరోజు మోకిల పోలీసుల ముందు విచారణకు Read more

మోడీతో గూగుల్ CEO భేటీ – డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్
మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు

మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య జరిగిన Read more

Kashi: కోట్ల ఆస్తులున్న కాశీలో తల్లిని వదిలేసిన ఘనుడు
Kashi: కోట్ల ఆస్తులున్న కాశీలో తల్లిని ...

వారణాసి ఘాట్ పై కనిపించిన మాతృమూర్తి ఉత్తర్ ప్రదేశ్‌లోని పవిత్రమైన వారణాసి బనారస్ ఘాట్ వద్ద ఒక విషాదకర ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ తల్లి, Read more

Advertisements
×