Hamas key statement during Israeli attacks

Hamas: ఇజ్రాయెల్ దాడుల వేళ హమాస్ కీలక ప్రకటన

Hamas: మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన అనంతరం గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం భారీ వైమాణిక దాడులు చేయడంతో 400 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ హమాస్ కీలక ప్రకటన చేసింది. చర్చలకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణ అమలు చేయాలని అందుకు గాను ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంది. కాల్పుల విరమణను తిరిగి అమలు చేసేందుకు హమాస్ సిద్ధంగా ఉంది. కానీ జనవరి 19న అమల్లోకి వచ్చిన ఒప్పందంపై తిరిగి చర్చలు జరపబోము. చర్చలకు ఇంకా సమయం ఉంది. కానీ కొత్త ఒప్పందాలు అవసరం లేదు అని హమాస్ ప్రతినిధి తాహెర్ అల్ నును తెలిపారు.

Advertisements
ఇజ్రాయెల్ దాడుల వేళ హమాస్

గతంలో మాదిరిగానే అగ్రిమెంట్

తమకు ఎటువంటి షరతులూ లేవని, రెండో దశ కాల్పుల విరమణకు వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే అగ్రిమెంట్ ఉండాలని కానీ కొత్త ఒప్పందాలను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలో ముగిసింది. అయితే రెండో దశ కాల్పుల విరమణ ఉంటుందని అంతా భావించినప్పటికీ దానికి సంబంధించిన చర్చలు ప్రారంభం కాలేదు. దీంతో మిగిలిన బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ హమాస్‌కు సూచించింది. కానీ హమాస్ దానిని పట్టించుకోకపోవడంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది.

Related Posts
ఉచిత ఇసుక పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
free sand telangana

ఉచిత ఇసుక పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని Read more

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు షాక్‌..
A shock to Kejriwal before the Delhi elections

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు Read more

ఎలాన్ మస్క్ మళ్ళీ రికార్డు: నెట్ వర్థ్ $300 బిలియన్ ని దాటింది
elon

ప్రపంచంలో అతి ధనవంతులైన వ్యక్తుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఎప్పటికప్పుడు చూస్తాం. తాజాగా, ఎలాన్ మస్క్‌ ఆర్థికంగా మరింత ఎదుగుదలను సాధించారు. ఆయన నెట్ వర్థ్‌ $300 Read more

గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే
celbs income

ఆదాయపు పన్ను భారీగా చెల్లించిన భారతీయ సెలబ్రిటీలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఇందులో మన సౌత్ స్టార్ హీరో 2వ స్థానం దక్కడం ఇంటర్నెట్‌లో సంచలనం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *