అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్, తాజాగా చేసిన ఒక ప్రకటనతో మరోసారి వివాదాస్పదంగా మారాడు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నలిగిపోయిన గాజాను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన తర్వాత చేశారు.గాజాను స్వాధీనం చేసుకున్న తర్వాత, అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మించాలనేది ట్రంప్ యోచన. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అనేక ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు.

ఈ ప్రకటనపై నెతన్యాహు స్పందిస్తూ, ఈ నిర్ణయం చరిత్రను మార్చేలా ఉంటుందని ప్రశంసించారు.అయితే గాజాలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనా ప్రజలకు అరబ్ దేశాలు ఆశ్రయం ఇవ్వాలంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఈ దేశాలు వ్యతిరేకంగా స్పందించాయి. ఈ క్రమంలో ట్రంప్ ఈ ప్రకటన చేశాడు. గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఇక ఈ ప్రకటనను హమాస్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఈ ప్రకటనను గాజాలో పరిస్థితులను మరింత కష్టతరంగా మార్చేందుకు చేశాడని హమాస్ ఆరోపించింది. తమ స్వాధీనం తీసుకున్న ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు పెంచేందుకు ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నాడని హమాస్ పేర్కొంది. అంతేకాక, హమాస్ ఈ దురాక్రమణను అడ్డుకుంటామని ప్రకటించింది.