Half day schools schools from March 15th government orders

15 నుంచి ఒంటిపూట బడులు.. ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. ఆ తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని చెప్పింది.

15 నుంచి ఒంటిపూట బడులు

ఏప్రిల్‌ 24 నుంచి సెలవులు

ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్‌, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలకు హాఫ్‌ డే ఉంటుందని.. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగే పాఠశాల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను తెలియజేయడంతో పాటు అమలును స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్ట్‌ ఆదేశించారు. కాగా, సెలవుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్‌ 24 నుంచి సెలవులు ప్రకటించి.. తిరిగి జూన్‌ 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Related Posts
ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత ఇకలేరు
ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత ఇకలేరు – పారిశ్రామిక రంగానికి తీరని లోటు!

గుంటూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ (77) నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ Read more

జనవరి 10 నుండి వైకుంఠద్వారదర్శనం
tirumala vanabhojanam

ప్రముఖ వైష్ణవాలయాలలో వైకుంఠద్వార దర్శనాలకు సమయం సమీపిస్తోంది. పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ద్వాదశిని వైకుంఠద్వాదశిగా ప్రసిద్ధి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో Read more

అమెరికా సరిహద్దులపై వేలాది మైగ్రెంట్స్..
migrants scaled

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో, భారీ సంఖ్యలో మైగ్రెంట్స్ (తాత్కాలికంగా వలస వచ్చిన వారు) అమెరికా సరిహద్దుల వద్ద చేరుకుంటున్నారు. ట్రంప్ Read more

పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు
New Income Tax Bill before Parliament

లోక్‌సభ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు..విపక్షాలు వాకౌట్ న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో 'నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025'ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *