Hail showers in Telugu states today and tomorrow!

Rains: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వడగండ్ల వానలు!

Rains : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కి. మీ. వేగంతో గాలులూ వీయొచ్చని పేర్కొంది.

Advertisements
తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు

పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ

తెలంగాణలో మరో రెండు రోజులు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కొన్ని జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఇవాళ, రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో తల్లిదండ్రులు స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.

ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచిన

కాగా, ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నిజామాబాద్‌, కామారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ పరిసరాల్లో గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నేడు, రేపు ఆదిలాబాద్‌, వికారాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించారు. ప్రజలు బయట తిరగడం తగ్గించి, ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు.

Related Posts
Aruna D.K : భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి – డీకే అరుణ
హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం

బీజేపీ ఎంపీ డీకే అరుణ తన ఇంట్లోకి అనుమానాస్పద వ్యక్తి ప్రవేశించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. హాల్, కిచెన్, బెడ్‌రూమ్ వంటి ప్రదేశాల్లో ఆ వ్యక్తి వెతికినప్పటికీ, Read more

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
BJP slams Rahul Gandhi

ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటనని Read more

రెడ్‌మీ నోట్‌ 14 5G సిరీస్‌లో ₹1000 కోట్ల మైలురాయి సంబరాలు
Redmi Note 14 5G series celebrates ₹1000 crore milestone

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్‌ X Alot బ్రాండ్‌ షౌమీ ఇండియా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఆవిష్కరణలను పునర్‌నిర్వచిస్తూ అంతర్జాతీయంగా సరికొత్త ఫోన్‌ రెడ్‌మీ 14C Read more

NIA : తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్న ఎన్ఐఏ
NIA collecting voice samples of Tahawwur Rana

NIA : ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్నాడు. ముంబై దాడులకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×