లండన్ ప్రయాణానికి ఎయిర్ ఇండియా విమానం (Air India plane) ఎక్కిన విజయ్ రూపాని. తన కూతురిని కలవడానికి బయలుదేరారు. కానీ ఈ ప్రయాణం విషాదంగా మారింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.విమానంలో కూర్చున్న విజయ్ (Vijay) రూపాని ఫొటో బయటకు వచ్చింది. అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ తీసిన ఫొటో ఇది. ఆమె తీసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చాలా వేగంగా వైరల్ అయ్యింది.విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపాని పేరు ఉంది. అధికారికంగా ఆయన ఈ విమానం ఎక్కినట్టు నిర్ధారించారు. ఇది ప్రజల్లో కలకలం రేపింది.
విమానంలో మొత్తం 242 మంది
ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. విమానం మంటల్లో కరిగిపోయింది.విమాన ప్రమాద వార్త బయటకు రాగానే కేంద్రం అలర్ట్ అయింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షించారు.
ఎయిర్ ఇండియా స్పందన
ఎయిర్ ఇండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పూర్తి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.తన కూతురిని చూడాలని బయలుదేరిన ఆయన జీవితం అక్కడే ముగిసింది. చివరి ఫొటో నెట్టింట చలింపునిస్తుంది.ఈ వార్త దేశవ్యాప్తంగా విషాదం నింపింది. మాజీ సీఎం విజయ్ రూపాని మృతితో గుజరాత్ రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వ పెద్దలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Air India : బోయింగ్ 787-8కు ఇదే తొలి ప్రాణాంతక ప్రమాదం!