హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1పై అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారంతో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. గత వారంలో గ్రూప్-1 (Group-1) పిటి షన్లపై వాదనలు విన్న హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ ప్రారంభం కాగానే ఈ రోజే వాదనలు పూర్తి చేయాలని.. ఏమైనా వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు సూచించింది. అనంతరం ఇటు పిటిషనర్ల తరపు వాదనలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్సీ) తరపున వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గ్రూప్-1 (Group-1) మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగా యంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుదీర్ఘ వాద ప్రతివాదనల అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ మెయిన్స్ జవాబు పత్రాల రీవాల్యుయేషన్ చేయడం, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోర్టును కోరారు. టిజిపిఎస్సి తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి (S Niranjan Reddy) పిటిషనర్ల తరపు వాదనలను తోసిపుచ్చారు.

గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల ఆరోపణలు
మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పలువురు గ్రూప్-1 అభ్యర్థులు పిటీషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్లో ఈ పిటీషన్లపై వాదనలు జరిగిన సందర్భంలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (Verification of certificates) మాత్రం పూర్తి చేయొచ్చని హైకోర్టు టిజిపిఎస్సిని ఆదేశించింది. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జి, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. విచారణ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటీషన్లు దాఖలు పారదర్శకంగా మూల్యాంకనం చేశారని, జరిగిందని టిజిపిఎస్సి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సోమవారం జరిగిన వాదనల సందర్భంగా.. వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి సూచించారు. గ్రూప్-1 నియా మకాలపై ఉన్న స్టేను తొలగించాలని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటీషన్ పైనా వాదనలు ముగిశాయి. సంవత్సరాల తరబడి కష్టపడి ఉద్యోగం సాధించినా కోర్టు కేసుల వల్ల సకాలంలో నియామకాలు జరగడంలేదని ఇంప్లీడ్ పిటీషనర్ల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు వేసిన పిటీషన్ల వల్ల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం వల్ల నష్టం జరుగుతోందని వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
హైకోర్టు తీర్పు ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది?
కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వత కొన్ని రోజుల నుంచి వారాల లోపే తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది.
వాదనలు పూర్తయ్యాక ఏ నిర్ణయం తీసుకుంది?
వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది
గ్రూప్-1 ప్రాసెస్ రద్దవుతుందా?
అది కోర్టు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Jishnu Deva Varma: కొత్త పరిశోధన మైలురాళ్లను నిర్దేశిస్తున్న యువత – గవర్నర్ జిష్ణుదేవవర్మ