ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఖరీఫ్ పంట సీజన్ కోసం రైతులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్న, మధ్య తరహా రైతులకు 90 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలను (Groundnut seeds) అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా ఆ ప్రాంతాల్లో పంట దిగుబడులు పెరగడమే కాకుండా రైతులపై ఆర్థిక భారం తగ్గనుంది.
రాయలసీమ రైతులకు 40% సబ్సిడి
రాయలసీమ ప్రాంతం సహా మిగతా జిల్లాల్లో రైతులకు 40 శాతం రాయితీపై విత్తనాలు ఇవ్వనున్నారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో రైతుకు గరిష్ఠంగా 90 కిలోల విత్తనాలను పంపిణీ చేయనున్నారు. ఈసారి సరఫరా అయ్యే విత్తనాల్లో కే6, టీసీజీఎస్ 1694, టీఏజీ 24, నారాయణి రకాలు ఉన్నాయి. వీటి ధరలను క్వింటాలుకు రూ. 8,200 నుండి రూ. 9,300 వరకు నిర్ణయించారు.
డిజిటల్ పద్ధతిలో పంపిణీ
రైతులకు విత్తనాల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “డి-కృషి యాప్” ద్వారా ఈ సేవలు అందించనుంది. ఈ యాప్ ద్వారా రైతులు తమ అవసరాలను నమోదు చేసి, నేరుగా విత్తనాలను పొందవచ్చు. ఇది మధ్యవర్తిత్వాన్ని తొలగించి, నిజమైన లబ్ధిదారులకు తక్కువ ధరకే విత్తనాలను అందించేందుకు దోహదపడుతుంది.
Read Also : TG Cabinet : క్యాబినెట్ విస్తరణపై నేడు తుది నిర్ణయం!