Grenade Attack : అమృత్‌సర్‌లోని ఓ గుడిపై గ్రేనేడ్ దాడి జరిగింది. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరినట్లు తెలిసింది. అర్థరాత్రి గ్రేనేడ్ దాడి జరిగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పేలుడు వల్ల ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. ఎవరికీ గాయాలు కాలేదు. పూజారి, అతని కుటుంబం.. ఆ గుడి పైభాగాన ఉంటున్నారు. వాళ్లకు ఎటువంటి హాని జరగలేదు.

మతపరమైన ప్రదేశంపై దాడి
సీనియర్ పోలీసు అధికారుల ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. నగరంలో తొలిసారి మతపరమైన ప్రదేశంపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎక్కువ సార్లు అక్కడ పోలీసు స్టేషన్లపై దాడులు జరిగేవి. గడిచిన నాలుగు నెలల్లో గ్రేనేడ్ దాడి ఘటన చోటుచేసుకోవడం ఇది 12వసారి. దాడిని స్థానిక నేత కిరణ్‌ప్రీత్ సింగ్ ఖండించారు. పంజాబ్‌లో ఉన్న శాంతికి విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందన్నారు.
శాంతి, సౌహార్దానికి విఘాతం కలిగించే కుట్ర
పంజాబ్‌లో నెలకొన్న శాంతి, సౌహార్దానికి విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తితోపాటు అతడి సహచరుడిని స్థానికులు అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, దాడికి ముందు నిందితులు ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించారని పోలీసులు వెల్లడించారు.