Grant anticipatory bail.Ram Gopal Varma in High Court

ముందస్తు బెయిల్‌ ఇవ్వండి..హైకోర్టులో ఆర్జీవీ

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని… వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

Advertisements

ఇకపోతే.. పోలీసుల నోటీసుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మంగళవారం రోజు వర్మ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆ రోజు ఉదయమే ఈ రోజు విచారణకు రాలేను.. మరికొంత సమయం కావాలంటూ సంబంధిత పోలీసులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టారు. ఇక ఆ తర్వాత.. ఆర్జీవీ తరపున పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు.. సినిమా షూటింగ్‌ కారణంగా ఆర్జీవీ ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోయారని.. కొంత సమయం ఇవ్వాలని కోరారు. మొత్తంగా పోలీస్ విచారణకు హాజరుకాని వర్మ.. ఇప్పుడు ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ బెయిల్‌ పిటిషన్‌పై రేపు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Related Posts
ఏఐ సాంకేతికకు తెలంగాణ మద్దతు
Telangana support for AI technologies

హైదరాబాద్ : స్టార్టప్‌లు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయని, సామాజిక ప్రభావాన్ని పెంచే ఏఐ సొల్యూషన్స్‌కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, Read more

పాక్‌లో మారణహోమం
jaffar express hijack

పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలను రేకెత్తించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారు. హైజాక్ అనంతరం పాకిస్తాన్ Read more

నేడు పార్లమెంటుముందుకు కొత్తఐటీ బిల్లు
New IT bill before Parliame

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి, ఆధునిక అవసరాలకు తగిన విధంగా మార్చే లక్ష్యంతో Read more

Bhogapuram: భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Bhogapuram: భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌: అభివృద్ధి వైపు శరవేగం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ అయిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. Read more

×