Grant anticipatory bail.Ram Gopal Varma in High Court

ముందస్తు బెయిల్‌ ఇవ్వండి..హైకోర్టులో ఆర్జీవీ

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని… వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

Advertisements

ఇకపోతే.. పోలీసుల నోటీసుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మంగళవారం రోజు వర్మ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆ రోజు ఉదయమే ఈ రోజు విచారణకు రాలేను.. మరికొంత సమయం కావాలంటూ సంబంధిత పోలీసులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టారు. ఇక ఆ తర్వాత.. ఆర్జీవీ తరపున పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు.. సినిమా షూటింగ్‌ కారణంగా ఆర్జీవీ ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోయారని.. కొంత సమయం ఇవ్వాలని కోరారు. మొత్తంగా పోలీస్ విచారణకు హాజరుకాని వర్మ.. ఇప్పుడు ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ బెయిల్‌ పిటిషన్‌పై రేపు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Related Posts
అల్లుఅర్జున్ అరెస్ట్ పై ప్రముఖుల స్పందన
revanth reddy 292107742 16x9 0

శుక్రవారం ఉదయం జరిగిన సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ Read more

ఎస్ఎల్‌బీసీ సొరంగం నుండి వెనక్కి వచ్చిన రక్షణ సిబ్బంది
కష్టంగా కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో మట్టి, బురద కారణంగా సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) మరియు ఎన్జీఆర్ఎఫ్ నిపుణులు, ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసి, Read more

పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం
పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం

తెలంగాణ హైకోర్టులో రామారావు ఇమ్మనేని అనే న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పుష్ప 2: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసు Read more

పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్
TPCC chief Mahesh Kumar Zoom meeting with party leaders

మండల అధ్యక్షులకు దిశానిర్దేశం హైదరాబాద్‌: రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల Read more

×