బీసీలకు 42% రిజర్వేషన్లు (42% Reservation for BCs) కల్పించే అంశంపై ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు రెండు రోజుల క్రితమే చేరింది. అయితే ఇప్పటికీ గవర్నర్ ఆర్డినెన్స్‌పై తన నిర్ణయం ప్రకటించకపోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది ఒక ప్రధాన విషయంగా మారడంతో గవర్నర్ ఆర్డినెన్స్‌లోని అంశాలపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.
నేడు లేదా రేపు నిర్ణయం తీసే అవకాశం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఈ రోజు లేదా రేపు ఆర్డినెన్స్‌పై సంతకం చేస్తారో లేదో ఇంకా స్పష్టత లేదు. ఈ అంశంపై ఆయన న్యాయ నిపుణులతో చర్చించి అన్ని కోణాలు పరిశీలిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిస్తే, రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శకాలు కూడా పంపించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం
ఆర్డినెన్స్‌కు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసింది. స్థానిక సంస్థలలో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనిపై గవర్నర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. నిర్ణయం ఎలా వచ్చినా, రాష్ట్రంలో రాజకీయ వేడి మరోసారి పెరిగే అవకాశముంది.
Read Also : Vijay Devarakonda : డెంగ్యూ తో హాస్పటల్లో చేరిన విజయ్ దేవరకొండ..?