హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలపై వివాదాస్పద ఆరోపణలు వెలుగుచూశాయి. మిస్ ఇంగ్లండ్‌గా పాల్గొన్న మిల్లా మాగీ (Milla Magee), ఈ పోటీల్లో తనపై అనుచితంగా ప్రవర్తించారని, తనను ఓ వేశ్యలా చూశారని మీడియా ముందుకు వచ్చారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పోటీల ఆతిథ్య హక్కులు చేపట్టిన తెలంగాణపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు
ఈ ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు సీనియర్ ఐపీఎస్ అధికారిణి షికా గోయెల్, రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వం వహించనున్నారు. పోటీల్లో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్లతో మాట్లాడి, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేయనున్నారు.
వాస్తవాల ఆధారంగా నివేదిక
అవమానకరంగా ప్రవర్తించిన ఘటనలకు సంబంధించి ఆధారాలు సమీకరించేందుకు అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు. మిల్లా ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉందో, ఏవైనా అవ్యవస్థలు జరిగాయా అనే దానిపై నివేదిక సమర్పించనున్నారు. ఈ విచారణలో వస్తే మార్గదర్శక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీలో ఇలాంటి ఆరోపణలు ఎదురవ్వడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also : PM Unemployment Insurance Scheme: నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 4,500.. నిజమిదే!