Government key decision on indiramma atmiya bharosa assurance..!

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చనుంది. ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీకి ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గ్రామ సభల్లో, మండల కార్యాలయాల్లో జనవరిలో నాలుగు రోజులపాటు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ చేస్తామని, మార్పులకు అవకాశం లేదని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన డీఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది.

image

దాదాపు 6 లక్షల మందిని లబ్ధిదారులను తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేసింది. కొత్తగా వచ్చిన 2,24,487 దరఖాస్తుల్లో 19,193 అప్లికేషన్లకు ఓకే చేశారు. ఓవరాల్‌గా పలు కారణాలతో 1,44,784 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మరో 59,542 దరఖాస్తులపై నిర్ణయం పెండింగ్‌లో ఉంది. వాటిలో మరో 5, 6 వేల వరకు అర్హులుగా మారతారని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ భరోసాకు 5,80,577 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 25 నుంచి 30 వేల మంది అర్హుల జాబితాలో చేరనున్నారు. ఉపాధి హామీ పథకం కింద 2023-24లో 20 రోజుల పని దినాలు పూర్తి చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.

కుటుంబ యజమాని పేరిట గానీ, ఇతర కుటుంబసభ్యులకు గానీ ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అన్హరులు అవుతారు. కొన్ని అప్లికేషన్లు రిజెక్టు కావడంపై తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. కుటుంబ యాజమానికి, లేక కుటుంబంలో ఎవరికైనా 10 ఏళ్ల క్రితం భూమి అమ్ముకున్నా వారి పేర్లు రికార్డుల్లో ఉండటంతో వారిని సైతం ఈ పథకానికి ఎంపిక చేయలేదు. వీరిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. భూమి విక్రయించినా, రికార్డుల్లో వారి పేరు ఉన్న వారిని ప్రస్తుతానికి లబ్దిదారులుగా ప్రభుత్వం గుర్తించడం లేదు.

Related Posts
బిజెపి నేతతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెల్ఫీ
MP Shashi Tharoor selfie

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ Read more

పెను విషాదం : తిరుపతి తొక్కిసలాటకు కారణమిదే..
womandies ttd

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. పద్మావతి పార్క్ వద్ద భక్తులు టోకెన్ల కోసం Read more

గోదావరి ఎక్స్ ప్రెస్ లో పొగలు..!
Smoke in Godavari Express

వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఏసీ కోచ్‌లో జరిగిన ఘటన భయానక వాతావరణాన్ని సృష్టించింది. రాత్రి 1 గంట సమయంలో ఖమ్మం Read more

అంబటి రాంబాబు పై కేసు నమోదు.. !
case has been registered against Ambati Rambabu.

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. ఏపీ పోలీసులు అంబటి రాంబాబు పై కేసు నమోదు చేశారు. టీడీపీ, జనసేన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *