ap ration shop

ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ ..

ఏపీలో రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్​ దుకాణాల్లో నేటి (అక్టోబర్​ 11) నుంచి నెల ఆఖరు వరకు పామోలిన్‌ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Advertisements

ఒక్కో రేషన్‌ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరల నియంత్రణపై వారితో చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్‌ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు.

Related Posts
నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా
It's endgame for Naxalism in India, says Amit Shah, meets former insurgents

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో Read more

Uttam Kumar Reddy : ఏపీ నీటిపై ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
Uttam Kumar Reddy ఏపీ నీటిపై ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో నీటి సమస్య మరోసారి వేడెక్కుతోంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ Read more

హైడ్రా ఫిర్యాదులు స్వీకరించిన కమీషనర్ రంగనాథ్..!
Commissioner Ranganath received Hydra complaints.

హైదరాబాద్‌: ఈరోజు నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 78 ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు ఈ మొత్తం ఫిర్యాదులను మీషనర్ రంగనాథ్ స్వయంగా స్వీకరించారు. చెరువులు, నాళాల, ర‌హ‌దారులు, Read more

ఇండియాలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా..?
Howrah Amritsar Mail

భారతదేశంలోని అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా హౌరా-అమృత్సర్ రైలు వార్తల్లో నిలిచింది. ఇది 1910 కిలోమీటర్ల దూరాన్ని 37 గంటలు పడుతూ, 111 స్టేషన్లలో ఆగుతూ Read more

×