ap ration shop

ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ ..

ఏపీలో రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్​ దుకాణాల్లో నేటి (అక్టోబర్​ 11) నుంచి నెల ఆఖరు వరకు పామోలిన్‌ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ఒక్కో రేషన్‌ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరల నియంత్రణపై వారితో చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్‌ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు.

Related Posts
కోల్ కతా డాక్టర్ మర్డర్ కేసులో దోషికి జీవిత ఖైదు
rg kar

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ కమ్ ఆస్పత్రిలో 31 ఏళ్ల డ్యూటీ డాక్టర్ పై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనలో సీల్దా Read more

ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) రూ. 44,776 కోట్ల పెట్టుబడులతో కూడిన 15 ప్రాజెక్టులకు గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు Read more

పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి
పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి

పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో Read more

కర్మ అంటే ఇదే… రఘురామ – డిప్యూటీ సీఎం పవన్
raghuram pawa

కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *