हिन्दी | Epaper
గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Gold: వరదల్లో కొట్టుకుపోయిన రూ.12కోట్ల బంగారం

Sharanya
Gold: వరదల్లో కొట్టుకుపోయిన రూ.12కోట్ల బంగారం

బంగారాన్ని ఎవరైనా భద్రంగా దాచుకుంటారు. బీరువాల్లో, లాకర్లల్లో పెట్టి వాటిని ఎంతో భద్రత కల్పిస్తాం. ఇక వంటిపై వాటిని ధరించినా, కళ్లన్నీవాటిపై ఉంచి జాగ్రగా చూస్తుంటాం. ఎందుకంటే బంగారం ధరలకు రోజురోజుకు రెక్కలొస్తున్నాయి. లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. అలాంటిది కోట్లాది విలువచేస్తే వరదల్లో కొట్టుకునిపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా చైనాలో ఇదే జరిగింది. గతకొన్ని రోజుల నుంచి చైనా (China) లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా పాంతాల్లో వరదలు పోటెత్తాయి. షాంగ్జీ ప్రావిన్స్ లో వరదల ప్రభావం వల్ల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో నుంచి బంగారం (Gold), వెండి ఆభరణాలు కొట్టుకుపోవడం కలకలం రేపింది. వాటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో వాటి కోసం వీధుల్లో ఉండే స్థానికులు వెతికేందుకు పోటీపడ్డారు. బంగారం కోసం గంటల తరబడి వాళ్లు వెతుకుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోసల్మీడియాలో వైరల్ అవుతోంది.


సముద్రతీరంలోని ప్రాంతం

జులై 25న షాంగ్జీ ప్రావిన్స్ (Shaanxi Province) లోని వుచి కౌంటీలో భారీ వరదల వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రతీరానికి దగ్గర్లోనే ఈ ప్రాంతం ఉంది. లావో ఫెంగ్జియాంగ్ అనే జువెల్లరీ షాప్ నుంచి ఆభయణాలు కొట్టుకుపోయాయి. ఆ రోజున ఎప్పట్లాగే ఆభరణాల దుకాణాన్ని తెరిచి ఉంచారు. కానీ భారీ వర్షాల వల్ల ఆ ప్రాంత నీటమునిగింది. ఈ క్రమంలోనే వరద షాప్ లోకి వచ్చింది. వరద ఉద్ధతి పెరగడం వల్ల సిబ్బంది కళ్లముందే ఆభరణాలు కొట్టుకుపోయాయి. అది చూసిన సిబ్బంది షాకైపోయారు. వరదల్లో కొట్టుకుపోయిన ఆభరణాల్లో బంగారు (Gold) హారాలు, ఉంగరాలు, చెవి దుద్దులు, గాజులతో పాటు వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని దుకాణ యజమాని మీడియాకు చెబుతూ ఆవేదన చెందారు. అంతేకాదు సేఫ్ సెఫ్ బాక్సులో రీసైకిల్ చేసిన బంగారం, అలాగే భారీగా నగదు ఉన్నాయని.. అది కూడా వరదల్లో కొట్టుకుపోయిందని వాపోయారు. మొత్తంగా తన షాపులో నుంచి 20కిలోల బంగారం, నగదు కొట్టుకుపోయినట్లు చెప్పారు. దీని విలువ 10మిలియన్ల యువాన్లు మన కరెన్సీలో రూ.12 కోట్లుపైగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/earthquake-major-earthquake-in-afghanistan/international/524729/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870