gold price

భారీగా పడిపోయిన గోల్డ్ రేట్

పండగవేళ బంగారం ధరలు దిగివస్తుండడం అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ సెషన్ తర్వాత బాగా తగ్గిన బంగారం ధరలు.. గత కొన్ని రోజులుగా పైపైకి పోతూ మళ్ళీ భగ్గుమంటున్నాయి. క్రమంగా గోల్డ్ రేట్లు ఆల్ టైం హైకి చేరుకోవడంతో జనం అయోమయంలో పడ్డారు. గత వారం రోజుల్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పు కనిపించింది. అయితే ఈ రోజు మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి. పండగ సమయంలో బంగారం కొనాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం.

మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.77,880 ఉండగా, బుధవారం నాటికి రూ.710 తగ్గి రూ.77,170కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.93,010 ఉండగా, బుధవారం నాటికి రూ.500 పెరిగి రూ.90,510కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,350గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 77,100గా ఉంది. వెండి ధర మాత్రం పెరిగింది. గత 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97 వేలు ఉంది.

హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ.10 తగ్గి రూ.70,990 వద్ద ఉంది. 24 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 77,440 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదే విధంగా ధరలు ఉన్నాయి. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,170గా ఉంది. కిలో వెండి ధర రూ.90,510గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,170గా ఉంది. కిలో వెండి ధర రూ.90,510గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,170గా ఉంది. కిలో వెండి ధర రూ.90,510గా ఉంది.

Related Posts
Rodasi : రోదసిలో ఎక్కువ కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలివే
sunitha1

రోదసిలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములు శారీరక శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ప్రభావంగా కండరాలు బలహీనపడటం, ఎముకలు దృఢత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు Read more

తమిళనాడులో భారీ వర్షాలు: పాఠశాలలు, కళాశాలలకు సెలవు
Schools Closed Rainfall

తాజా సమాచారం ప్రకారం, పుదుచ్చేరీ మరియు కరైకల్ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ సహాయం పొందిన పాఠశాలలు మరియు కళాశాలలకు నవంబర్ 27, 2024 న Read more

ఆరవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సెషన్ జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో Read more

KCR : కేసీఆర్కు దొంగనోట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది : బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
KCR కేసీఆర్కు దొంగనోట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

KCR : కేసీఆర్కు దొంగనోట్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది : బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే Read more