బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సూడాన్ (Sudan) తరచూ ప్రమాదాలకు కేంద్రబిందువవుతోంది. ముఖ్యంగా గనుల్లో భద్రతా ప్రమాణాల జాగ్రత్తలు లేకపోవడం, అక్కడ పనిచేస్తున్న కార్మికుల జీవితాలను ముప్పులోకి నెట్టేస్తోంది. తాజాగా తూర్పు సూడాన్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.తూర్పు నైలు నది ప్రావిన్స్‌లోని హోయిడ్ పట్టణానికి చెందిన కెర్ష్ అల్ ఫీల్ బంగారు గనిలో ఈ దుర్ఘటన జరిగింది. గనిలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు (11 workers in accident) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసరంగా స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఆకలితో కాదు, అసహాయతతో చనిపోతున్నారు
సూడాన్‌లోని బంగారు గనులు అధిక ఉత్పత్తి సామర్థ్యం కలిగివున్నా, భద్రత పరంగా అత్యంత వెనుకబడ్డవిగా ఉన్నాయి. మానవీయ ప్రమాణాలను పాటించకుండా, అసాధారణ పరిస్థితుల్లో కార్మికులను పనిలో నిమగ్నం చేస్తుండటమే ఇలాంటి ప్రాణనష్టాలకు కారణమవుతోంది. ఈ ఘటనలో మరణించిన వారంతా మైనర్లు కావడం బాధాకరం. అంటే వారి వయస్సు ఇంకా చిన్నదే.ఈ ప్రమాదంపై సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ స్పందించింది. గని కూలిపోయిందని, తవ్వకాలను తాత్కాలికంగా నిలిపేశామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఎందుకీ నిర్లక్ష్యం?
ఈ ఘటన మరోసారి అక్కడి గనుల భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశంగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కార్మికుల రక్షణపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. జీవితం కన్నా బంగారమే మేటి అన్న భావన మారాలన్నది ఈ ఘటనకు గల ప్రధాన సందేశం.
Read Also : Indigo Airlines : ఇండిగో విమానానికి ఇంజిన్ లో సమస్య : తృటిలో తప్పిన ప్రమాదం