GHMC : హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ అదిరిపోయే ఆఫర్! హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ (GHMC) సంతోషకరమైన వార్తను ప్రకటించింది. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ సడలింపులు ఇస్తూ కొత్త స్కీంను ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను, ఎర్లీ బర్డ్ స్కీంను అమలు చేయనుంది. జీహెచ్ఎంసీ అధికారులు ఈ స్కీంను సోమవారం ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ముందుగానే ఆస్తి పన్ను చెల్లించేవారికి 5% రాయితీ లభించనుంది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.ఈ రాయితీ కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తించనుంది. అయితే, గత ఆర్థిక సంవత్సరాల బకాయిలకు ఈ స్కీం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్ (One-Time Settlement) స్కీం ఈరోజుతో ముగియనుంది.

ఆస్తి పన్ను వసూళ్లను పెంచేందుకు నగరవాసులకు ప్రయోజనం కలిగించేందుకు ఈ కొత్త స్కీంను ప్రవేశపెట్టినట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది.ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రజలను ముందుగా పన్ను చెల్లించేందుకు ప్రోత్సహించేందుకు ఈ స్కీంను రూపొందించారు.జీహెచ్ఎంసీ తక్కువ సమయంలో అధికంగా ఆదాయం సమకూర్చుకోవచ్చు. పౌరులకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని 5% రాయితీ పొందే వీలుంటుంది.ఆస్తి పన్నును ఆన్‌లైన్ లేదా మేనువల్‌గా చెల్లించవచ్చు. జీహెచ్ఎంసీ అధికారిక వెబ్‌సైట్, మెహెర్ సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి.హైదరాబాద్‌లో ఉన్న ఆస్తిదారులు వీలైనంత త్వరగా తమ ఆస్తి పన్నును చెల్లించి 5% రాయితీ పొందవచ్చు. ఇంతవరకు బకాయిలున్నా, 2025-26 ఏడాదికి ముందస్తు చెల్లింపుతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది.