KTR

ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి : కేటీఆర్..!

హైదరాబాద్‌: ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిని రక్షించడం అసాధ్యమన్నారు.

Advertisements
image

ఈ క్రమంలోనే ఉప ఎన్నికలను ఫేస్ చేసేందుకు బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేటీఆర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద వేసిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
MLC election schedule released

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం Read more

భారతీయ వలసదారుల పట్ల భారత్ ఏమి చేయబోతుంది?
indian immigrants in us.

అమెరికా లో ఉంటున్న అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపుతోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలటరీ విమానం C-17 మోసుకొచ్చింది. మరింతమందిని వెనక్కి Read more

తమిళనాడులో కెమికల్ గ్యాస్ లీకేజీ..
gas leak tamilanadu

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఉన్న మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో కెమికల్ గ్యాస్ లీక్ జరిగి, కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు విద్యార్థులు Read more

షర్మిల, విజయమ్మపై పిటిషన్.. స్పందించిన జగన్
New law in AP soon: CM Chandrababu

తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మపై వేసిన పిటిషన్ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తన చెల్లి షర్మిల Read more

×