లండన్‌లోని ఓవల్ స్టేడియంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ,పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య ఘర్షణ (Clash between pitch curator Lee Fortis) చోటుచేసుకుంది. ఈ నెల 31 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ జరగనుంది. ప్రాక్టీసు కోసం భారత జట్టు ఓవల్ మైదానానికి చేరుకుంది.నెట్స్‌లో ఆటగాళ్లకు గంభీర్ సాధన చేయిస్తుండగా లీ ఫోర్టిస్ వచ్చి ఏదో చెప్పాడు. దీంతో గంభీర్ తీవ్రంగా స్పందించారు. నువ్వు కేవలం మైదాన సిబ్బంది మాత్రమే. మాకు చెప్పే హక్కు నీకు లేదు. కావాలంటే నీ అధికారులకు చెప్పు అని గంభీర్ హెచ్చరించినట్టు వీడియోలో వినిపించింది.వాగ్వాదం తీవ్రంగా మారడంతో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ జోక్యం చేసుకున్నారు. లీ ఫోర్టిస్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లి పరిస్థితిని సర్దుమణిగించారు. అయినప్పటికీ, ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగినట్టు వీడియోలో కనిపించింది.

కారణం ఇంకా స్పష్టంగా లేదు
వాగ్వాదానికి నిజమైన కారణం ఇంకా తెలియలేదు. పిచ్ సిద్ధం చేసే విధానం లేదా శిక్షణ సదుపాయాలపై విభేదాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఓవల్ స్టేడియం ఇంగ్లండ్‌లో ప్రసిద్ధ క్రీడా వేదిక. ఇక్కడి పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల రాబోయే టెస్ట్‌పై ఆసక్తి పెరిగింది.ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని టీమ్ ఇండియా కృతనిశ్చయంతో ఉంది.గంభీర్, లీ ఫోర్టిస్ వాగ్వాదం వీడియో అభిమానుల్లో చర్చనీయాంశమైంది. భారత జట్టు చివరి టెస్ట్ సన్నాహాల్లో ఈ ఘటన కలకలం రేపింది.
Read Also : Theft : ఐపీఎల్ జెర్సీ చోరీ – బీసీసీఐ కార్యాలయంలో దొంగతనం