Gadwal MLA Bandla Krishna M

బిఆర్ఎస్ లోనే ఉన్న అంటూ గద్వాల్ ఎమ్మెల్యే క్లారిటీ

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీ మార్పు గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నాను అని స్పష్టం చేశారు. కొందరు తనను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితాన్ని అప్రతిష్ఠపాలు చేసే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.

Bandla Krishna Mohan Reddy3
Bandla Krishna Mohan Reddy3

దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

ఈ తప్పుడు ప్రచారంపై గద్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి నిజం లేని ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

గతంలో కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ లోకి

కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అనంతరం తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అప్రచారాలను సహించేది లేదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తానని హెచ్చరించారు.

Related Posts
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..
Tirupati Deputy Mayor Election Postponed

అమరావతి: తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగాలి. అందుకు ఎస్వీయూ సెనేట్‌ హాలులో Read more

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీకొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి Read more

మహారాష్ట్రలో వణుకు పుట్టిస్తున్న ‘జీబీఎస్’ వైరస్
gbs syndrome

దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కలవరపెడుతోంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఉహించిన దానికంటే వేగంగానే Read more

మహేష్ బాబుకు బిగ్ షాక్
mahesh vote

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించబడిందన్న వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో ఇలాంటి సమస్యలు Read more