Gachibowli land issue.. CM's discussion with ministers

CM Revanth Reddy : గచ్చిబౌలి భూముల వ్యవహారం.. మంత్రులతో సీఎం చర్చ

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంచ గచ్చిబౌలి పరిధిలోని భూముల వ్యవహారం, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆందోళనలు, తాజా పరిణామాలపై ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో సీఎం సమీక్షించారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ఇప్పటికే స్పష్టం చేశారు.

Advertisements
గచ్చిబౌలి భూముల వ్యవహారం  మంత్రులతో

ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే

దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్‌ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందినది లేదని పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. హెచ్‌సీయూని సందర్శించేందుకు బయల్దేరిన బీజేపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. హెచ్‌సీయూ సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Related Posts
Paritala Sunitha: పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు
పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తాజాగా మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్ పాత్ర ఉందని ఆమె Read more

దేశంలో కులగణన ఎందుకు చేయడంలేదు: రాహుల్ గాంధీ
Why caste census is not done in the country.. Rahul Gandhi

న్యూఢిల్లీ : లోక్‌సభలో సోమవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటున్నాయని Read more

బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో
బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో

ఫిబ్రవరి 5 ఢిల్లీ ఎన్నికల కోసం బిజెపి తన మ్యానిఫెస్టోలో మొదటి భాగాన్ని శుక్రవారం విడుదల చేసింది, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ప్రతి గర్భిణీ స్త్రీకి Read more

శామ్‌సంగ్ E.D.G.E సీజన్ 9 విజేతలు
Samsung announces winners o

గురుగ్రామ్, భారతదేశం - డిసెంబర్ 2024: శామ్‌సంగ్, భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, శామ్‌సంగ్ E.D.G.E తొమ్మిదవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. (ఎంపవరింగ్ డ్రీమ్స్ గెయినింగ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×