కాలవలోకి దూసుకెళ్తున్న బైక్ (Bike) మీద నుంచి క్షణాల్లో దూకి ప్రాణాలను రక్షించుకున్న ఓ యువకుడి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టామ్ క్రూయిజ్ స్టంట్లు మర్చిపోండి… ఈ యువకుడు చూపించిన దూకుడు, సమయస్పందన జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.వీడియోలో కనిపించినట్లు, ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తున్నారు. అయితే, ఆ ముహూర్తాన ఎడమవైపు నుంచి ఓ కారు హఠాత్తుగా (The car suddenly) వచ్చి బైక్‌కు అడ్డంగా వచ్చింది. బైక్ డ్రైవర్ ఒక్కసారిగా భయపడి బైక్‌ను తప్పించబోయాడు. కానీ అదుపు తప్పిన బైక్ బ్రిడ్జి గుండా నేరుగా కాలవలోకి దూసుకెళ్లింది.అయితే అదే సమయంలో, వెనక కూర్చున్న యువకుడు మాటలు చెప్పేలోపే స్పందించాడు. బైక్ నీళ్లలో పడకముందే దూకి, బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకుని వేలాడాడు. అంతే కాదు, ఆ మరుసటి క్షణాన బ్రిడ్జిపైకి ఎక్కేశాడు. ఈ తీరును చూసిన నెటిజన్లు ఇతను టామ్ క్రూయిజ్‌ను మించిపోయాడు అంటూ కితాబులవర్షం కురిపిస్తున్నారు.ఈ యువకుడి వేగానికి, తెలివికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంత స్పీడ్‌గా స్పందించగలగడం అంత ఈజీ కాదు, బైక్ నుంచి ఇలా దూకడం.. అది కూడా భయపడకుండా.. అసలు షాక్ అయిపోయాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకరు అయితే “ఇదే అసలైన హీరోయిజం” అని పొగిడేశారు.
ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే చూస్తాం
ఇంత వరకు మనం ఇలాంటి సీన్‌లను పెద్దగా సినిమాల్లోనే చూసాం. కానీ ఇది నిజ జీవితంలో జరిగింది. అంత వేగంగా బైక్ నడుస్తుండగా, ఇలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, క్షణాల్లో అమలు చేయడం అసాధారణం అని నిపుణులు చెబుతున్నారు.
ఇది మొదటిసారి కాదు – ఫిబ్రవరిలో మరో సాహసం
ఈ తరహాలో ఇదే ఏడాది ఫిబ్రవరిలో కూడా ఓ సంఘటన జరిగింది. ఓ స్కైడైవర్ గాల్లో ఉన్నప్పుడే ఫిట్స్ రావడంతో అదుపు కోల్పోయాడు. వెంటనే తోటి స్కైడైవర్ సమయస్పందనతో అతడిని చేరుకుని పారషూట్ తెరిపించి క్షేమంగా కిందకి చేర్చాడు. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.ఈ తరహా సంఘటనలు మనలోని నిజమైన హీరోల్ని బయటకు తీస్తున్నాయి. టైమింగ్, తెగింపు ఉంటే ప్రమాదాలనూ మించొచ్చు అనే సందేశాన్ని ఈ యువకుడు మరోసారి గుర్తుచేశాడు.
Read Also : Stock Markets: నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు