Freebies announced by political parties not a good practice: Supreme Court

రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదు: సుప్రీంకోర్టు

ఉచితాలు ఇస్తుండటంతో ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించే విధానం సరైనదికాదని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ నిర్వహిస్తున్న న్యాయస్థానం, ఈ సందర్భంగా ఉచితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

image

ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదు.ఉచిత రేషన్‌,డబ్బులు అందుతుండటంతో ఎలాంటి పని చేయకుండానే ఆదాయం లభిస్తోంది.ప్రజలకు సౌకర్యాలను అందించాలనే ప్రభుత్వాల లక్ష్యం మంచిదే. కానీ,వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఉచితాల వల్ల అది జరుగుతోందా? ఎన్నికల సమయంలో ఇలాంటి ఉచిత వాగ్దానాలు ప్రకటించడం సరైన విధానం కాదు అని జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఈ మిషన్ ఎంత కాలం పాటు కొనసాగుతుందో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని పేర్కొంది.

Related Posts
మూసీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? భ‌ట్టి కి జ‌గ‌దీశ్ రెడ్డి స‌వాల్
jagadeesh saval

మూసీ సుంద‌రీక‌ర‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌ణాళిక ఏంటో చెప్పాల‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీని ఏం Read more

Chandrababu : జగన్ కు చంద్రబాబు గట్టి షాక్ ఇవ్వబోతున్నాడా..?
cbn shock

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్‌కు గట్టి షాక్ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు Read more

Lokesh: నేను పాల వ్యాపారిని.. అది మనందరీ బాధ్యత : లోకేశ్
I am a milk trader.. it is our responsibility.. Lokesh

Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చదువు అనంతరం నేరుగా రాజకీయాల్లోకి రాలేదని.. పాల వ్యాపారం చేసేవాడిని అని చెప్పుకొచ్చారు. శుక్రవారం Read more

Ashwin vyshnav: రైల్వే టికెట్ కొన్న ఆన్లైన్ లో క్యాన్సెల్ చేసుకొనే అవకాశం..
Ashwin vyshnav: రైల్వే టికెట్ కొన్న ఆన్లైన్ లో క్యాన్సెల్ చేసుకొనే అవకాశం..

రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కేంద్ర రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం, ప్రయాణికులు ఇకపై Read more