Ashwin vyshnav: రైల్వే టికెట్ కొన్న ఆన్లైన్ లో క్యాన్సెల్ చేసుకొనే అవకాశం..

Ashwin vyshnav: రైల్వే టికెట్ కొన్న ఆన్లైన్ లో క్యాన్సెల్ చేసుకొనే అవకాశం..

రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కేంద్ర రైల్వే శాఖ మరో ముందడుగు వేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం, ప్రయాణికులు ఇకపై కౌంటర్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్లను ఆన్లైన్ లో కూడా రద్దు చేసుకోవచ్చు. దీనివల్ల స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సమయం,ఆదా అవుతుంది.ఇప్పటివరకు, ప్రయాణికులు కౌంటర్ టిక్కెట్ రద్దు చేసుకోవడానికి, డబ్బు తిరిగి పొందడానికి స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది.ప్రస్తుతం, ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా 139 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా టికెట్ రద్దు చేయడం సులభం.అయితే, రిఫండ్ పొందేందుకు మాత్రం రిజర్వేషన్ కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది.ఈ డిజిటల్ చొరవ వల్ల లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Advertisements

టికెట్ ఆన్లైన్‌లో రద్దు చేసుకునే విధానం

ఐఆర్ సిటి సి వెబ్‌సైట్ (www.irctc.co.in) లోకి లాగిన్ అవ్వాలి.” మోర్” అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, “కౌంటర్ టికెట్ కాన్సలాటిన్ ” ఎంచుకోవాలి.అక్కడ పి ఎన్ ఆర్ నంబర్, రైలు నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.నియమాలు చదివి, చెక్‌బాక్స్ టిక్ చేయాలి.”సబ్మిట్ ” బటన్ నొక్కితే, మొబైల్ నంబర్కు ఓ టి పి వస్తుంది.ఓ టి పి నమోదు చేసి ధృవీకరిస్తే, పిఎన్ఆర్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.”టికెట్ క్యాన్సల్” బటన్ క్లిక్ చేస్తే, రిఫండ్ అమౌంట్ చూపిస్తుంది.పిఎన్ఆర్ రిఫండ్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.ఈ ఎస్ఎంఎస్ ను చూపించి, స్టేషన్ కౌంటర్‌ నుండి డబ్బు వాపసు పొందవచ్చు.

Capture

ముఖ్యమైన నిబంధనలు

బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ చెల్లుబాటు కావాలి.ఈ సదుపాయం నియంత్రిత సందర్భాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.రైలు ఆలస్యం లేదా రద్దయిన సమయంలో ఈ విధానం వర్తించదు.భారతీయ రైల్వే డిజిటల్ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేలా ఈ సదుపాయం తీసుకొచ్చింది. ఇకపై కౌంటర్ టికెట్ క్యాన్సిల్ చేయడానికి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే సులభంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణికుల సమయం, శ్రమ ఆదా అయ్యేలా కేంద్ర రైల్వే శాఖ చేపట్టిన ఈ చర్యను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవచ్చు.”రైల్వే ప్రయాణీకుల (టిక్కెట్ల రద్దు ఛార్జీల వాపసు) నియమాలు 2015లో సూచించిన సమయ పరిమితి ప్రకారం అసలు పిఆర్ఎస్ కౌంటర్ టికెట్‌ను అప్పగించిన తర్వాత రిజర్వేషన్ కౌంటర్ అంతటా వెయిట్‌లిస్ట్ చేయబడిన పిఆర్ఎస్ కౌంటర్ టికెట్ రద్దు చేయబడుతుంది” అని వైష్ణవ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Related Posts
భారతీయ వలసదారుల పట్ల భారత్ ఏమి చేయబోతుంది?
indian immigrants in us.

అమెరికా లో ఉంటున్న అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపుతోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలటరీ విమానం C-17 మోసుకొచ్చింది. మరింతమందిని వెనక్కి Read more

నేడు పార్లమెంటుముందుకు కొత్తఐటీ బిల్లు
New IT bill before Parliame

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి, ఆధునిక అవసరాలకు తగిన విధంగా మార్చే లక్ష్యంతో Read more

Sunita Williams : సునీతా విలియమ్స్ జీతం ఎంతంటే?
Sunita Williams arrival delayed further

భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ కొద్ది రోజుల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. అంతరిక్ష ప్రయాణాల్లో అనేక రికార్డులను నెలకొల్పిన ఆమె, Read more

త్వరలో భారతీయ సర్వర్లలో డీప్‌సీక్ AI: ఐటీ మంత్రి
త్వరలో భారతీయ సర్వర్లలో డీప్‌సీక్ AI: ఐటీ మంత్రి

భారతీయ సర్వర్లలో త్వరలో చైనీస్ AI ప్లాట్‌ఫారమ్ డీప్‌సీక్ హోస్టింగ్ ప్రారంభం అవుతుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. డీప్‌సీక్ ఓపెన్ సోర్స్ మోడల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×