Freebies announced by political parties not a good practice: Supreme Court

రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదు: సుప్రీంకోర్టు

ఉచితాలు ఇస్తుండటంతో ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించే విధానం సరైనదికాదని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ నిర్వహిస్తున్న న్యాయస్థానం, ఈ సందర్భంగా ఉచితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Advertisements
image

ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదు.ఉచిత రేషన్‌,డబ్బులు అందుతుండటంతో ఎలాంటి పని చేయకుండానే ఆదాయం లభిస్తోంది.ప్రజలకు సౌకర్యాలను అందించాలనే ప్రభుత్వాల లక్ష్యం మంచిదే. కానీ,వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఉచితాల వల్ల అది జరుగుతోందా? ఎన్నికల సమయంలో ఇలాంటి ఉచిత వాగ్దానాలు ప్రకటించడం సరైన విధానం కాదు అని జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఈ మిషన్ ఎంత కాలం పాటు కొనసాగుతుందో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని పేర్కొంది.

Related Posts
మరో విమాన ప్రమాదం..ఈసారి ఎక్కడంటే..!!
plane crashed at an army ai

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని పలువురి ప్రాణాలు బలయ్యాయి. మంగళవారం రాత్రి ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం Read more

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య..
Another Telugu student commits suicide in America

వాషింగ్టన్‌ : మరో తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు Read more

కార్ల అమ్మకాలపై మహారాష్ట్ర సర్కార్‌ కొత్త రూల్‌
Maharashtra government new rule on car sales

ముంబయి: కరోనా తర్వాత చాలా మంది ద్విచక్ర వాహనాలపై తిరగడం తగ్గించారు. చాలా మంది ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రభుత్వ రవాణా Read more

తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి
తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి

ప్రస్తుత కాలంలో సినిమాల చుట్టూ వృద్ధిచెందిన ప్రతికూలత మరియు ట్రోలింగ్ ధోరణికి వ్యతిరేకంగా ఇటీవల వ్యాఖ్యానించిన సంగీత దర్శకుడు తమన్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ముందుకు Read more

×