Free health insurance scheme to be implemented in AP soon

ఏపీలో త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు

దాదాపు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధపడింది. ఆరోగ్య శ్రీతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం అమలుకు ప్రభుత్వం ప్రక్రియ చేపట్టబోతోంది. దీనికి ముందు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. అందులో తక్కువకు కోట్ చేసిన వాళ్లకు ఈ టెండర్లు ఇవ్వనుంది. ప్రస్తుతం ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ ద్వారా సేవలు అందుతున్నాయి. ఇప్పుడు బీమా పథకం అమలులోకి వస్తే దాదాపు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు లభించనున్నాయి.

పరిమితులు, షరతులు లేకుండా అందరికీ సేవలు

రాష్ట్రంలో ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు విషయమై చర్చించేందుకు వారం పది రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో నిర్ణయం తీససుకోనున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా చేసి టెండర్లు పిలవబోతున్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ప్రతిపాదించిన అంశాల్లో మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అనంతరం టెండర్లు పిలవడం జరిగిపోతుంది. దీంతో పథకం అమలు ఏప్రిల్‌ లేదా మే నుంచి స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి పాతిక లక్షల విలువై సేవలు ఆరోగ్య శ్రీ ద్వారా లభిస్తున్నాయి. ఇప్పుడు తీసుకురాబోతున్న ఆరోగ్య బీమా పథకం ద్వారా పరిమితులు, షరతులు లేకుండా అందరికీ సేవలు అందుతాయి.

ఉచిత బీమా పథకం కూడా అమలులోకి

ఉచిత ఆరోగ్య బీమా పథకం వస్తే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీన్ని ప్రభుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ కొనసాగిస్తూనే ఉచిత బీమా పథకం కూడా అమలులోకి వస్తుందని చెబుతున్నారు. రెండున్నర లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ద్వారా సేవలు అందిస్తారు. ఆపై ఖర్చు అయితే ఆరోగ్య శ్రీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా రెండున్నర లక్షల లోపు వైద్య ఖర్చులు పెట్టే వారి సంఖ్య 90శాతానికిపైగా ఉంటోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

Related Posts
బడ్జెట్ లో వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు
budget

వ్యూహాత్మక అడుగులు ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా ఇదే ఏడాది కీలకమైన బీహార్ లోనూ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ Read more

ట్రంప్ వ్యాఖ్యలు నిజమే : వ్లాదిమిర్ పుతిన్
Trump comments are true: Vladimir Putin

మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగా Read more

ఆరోగ్య బీమా పథకం ‘సర్వః ’ను విడుదల చేసిన మణిపాల్‌సిగ్నా
A holistic health insurance scheme with special focus on the under insured segment in India

హైదరాబాద్‌: మణిపాల్‌సిగ్నా సర్వః మూడు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్లాన్‌లను : సర్వః ప్రథం , సర్వః ఉత్తమ్ మరియు సర్వః పరమం విడుదల చేసింది. ప్రజల ఆర్థిక Read more

ప్రభాస్ ‘స్పిరిట్’లో మృణాల్ ఠాకూర్?
mrunal prabhas

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న 'స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో సీతారామం ఫేమ్ నటి మృణాల్ ఠాకూర్ Read more