free bus ap

దీపావళి నుండి మహిళలకు ఫ్రీ బస్ – గురజాల జగన్ మోహన్

దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో చాలారోజులుగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఈ పథకం పై కీలక ప్రకటన చేశారు. జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంకా పెన్షన్లు పెంచాలి. రేషన్‌ కార్డులు ఇవ్వాలి. ఎన్టీఆర్‌ గృహాలు ఇవ్వాలి. ఇంకా ఎన్నో ఇవ్వాలని వచ్చామని అన్నారు. ప్రభుత్వం ఈ దీపావళి పండుగకు ఉచిత సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. అలాగే దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Related Posts
మంచం కావాలని కోరిన వల్లభనేని వంశీ… కుదరదన్న జైలు అధికారులు
విజయవాడ జైలులో వల్లభనేని వంశీ ప్రవర్తనపై వివాదం

విజయవాడ జిల్లా జైలుకు తరలించబడిన తరువాత, వల్లభనేని వంశీ తన ఆరోగ్యంపై గంభీరంగా ఆందోళన వ్యక్తం చేశారు. తనకు నడుం నొప్పి ఉందని మంచం కావాలని పట్టుబట్టారు. Read more

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘క్యాపిటల్యాండ్‌’
'Capitaland' offered to inv

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్‌ సంస్థ ‘క్యాపిటల్యాండ్‌’ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.450 Read more

విశ్వసనీయత అనేది ముఖ్యం: జగన్
jagan vijaysaireddy ycp

వైకాపాను వీడిన రాజ్యసభ ఎంపీ లపై ఆ పార్టీ అధ్యక్షడు జగన్ స్పందించారు.వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. Read more

పేర్ని నాని బెయిల్ మంజూరు కేసులో కీలక పరిణామం
పేర్ని నాని బెయిల్ మంజూరు కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో Read more