free bus ap

దీపావళి నుండి మహిళలకు ఫ్రీ బస్ – గురజాల జగన్ మోహన్

దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో చాలారోజులుగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది.

Advertisements

ఈ క్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఈ పథకం పై కీలక ప్రకటన చేశారు. జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంకా పెన్షన్లు పెంచాలి. రేషన్‌ కార్డులు ఇవ్వాలి. ఎన్టీఆర్‌ గృహాలు ఇవ్వాలి. ఇంకా ఎన్నో ఇవ్వాలని వచ్చామని అన్నారు. ప్రభుత్వం ఈ దీపావళి పండుగకు ఉచిత సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. అలాగే దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Related Posts
కాసేపట్లో పెద్దపల్లికి సీఎం రేవంత్
CM to Address Yuva Vikas Me

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో జరుగనున్న యువ వికాసం సభలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన Read more

కిరణ్ రాయల్ కి క్లీన్ చిట్
కిరణ్ రాయల్‌ కి క్లీన్ చిట్ – మళ్లీ దూసుకెళ్లనున్న జనసేన నేత

తిరుపతి జనసేన ఇన్చార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్ తాను ఎదుర్కొన్న ఆరోపణల నుంచి పూర్తిగా బయటపడ్డారు. జనసేన పార్టీ తాత్కాలికంగా అతన్ని పక్కన పెట్టినప్పటికీ, తాజా పరిణామాలు Read more

ఎర్ర‌బెల్లి షాకింగ్ కామెంట్స్.
ఎర్ర‌బెల్లి షాకింగ్ కామెంట్స్.

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో రోజుకో సంచలనం చోటు చేసుకుంటోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో, Read more

తిరుమలలో బయటపడ్డ భద్రత డొల్లతనం
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుమలలో భద్రతా వైఫల్యంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తోంది. తిరుమలకు చేరుకునే ముందు అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది అన్ని వాహనాలను నిలిపివేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. Read more