ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా కనిపించారు. దీంతో భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి భర్త బలవన్మరణానికి పాల్పడ్డినట్లు పోలీసులు (Police) అనిమానించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలోని (same family) నలుగురూ చనిపోవడంతో స్థానిక ప్రజలు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని సహబ్ఖేడ్ గ్రామానికి అమిత్ యాదవ్ (35) తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు అతడి తమ్ముడు సందీప్ యాదవ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన అమిత్ యాదవ్ ఇంటికి చేరుకున్నారు. లోపలకు వెళ్లి గదిలో అమిత్ మృతదేహం వేళాడుతూ ఉన్నట్లు గుర్తించారు.
భర్తే హంతకుడా ..
ఆ తర్వాత అమిత్ భార్య గీత (30), ఇద్దరు కుమార్తెలు (10ఏళ్లు, 6 ఏళ్లు) చనిపోయి ఉన్నట్లు కనిపించారు. ఒకే గదిలో నాలుగు మృతదేహాలు ఉండటం చూసి ఒక్కసారిగా పోలీసులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చనిపోయినా వారి మృతదేహాలపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని ముందుగా గుర్తించారు. ఆ తర్వాత అమిత్ మొదట తన భార్యను, ఇద్దరు కుమార్తెలను చంపి, ఆపై బలవన్మరణానికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల ప్రజలను ప్రశ్నించామని చెప్పారు. ఘటన వెనుక గల కారణాలు తెలుసుకోవడానికి, మానసిక ఒత్తిడి, గృహ కలహాలు, ఆర్థిక పరిస్థితులు సహా మొదలైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే అమిత్ యాదవ్ కుటుంబం మరణించిన తర్వాత గ్రామంలో విషాద వాతావరణం అలుముకుంది. అమిత్ ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి అని గ్రామస్థులు తెలిపారు. అందుకే ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. ఒక కుటుంబం మొత్తం చనిపోవడానికి అసలు కారణమేమిటోనని అంతా చర్చించుకుంటున్నారు.
Read Also : Teacher: విద్యార్థితో లైంగిక వేధింపులు..మహిళ టీచర్ కు జైలు శిక్ష