కెనడా తాజా క్యాబినెట్‌లో భారత సంతతికి చెందిన నలుగురు నేతలు కీలక పదవులకు ఎంపికవడం గర్వకారణంగా మారింది. ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త మంత్రివర్గంలో అనితా ఆనంద్ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనితా ఇప్పటికే కెనడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు. ఆమెకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించడాన్ని విశ్లేషకులు కీలక పరిణామంగా పేర్కొంటున్నారు.
మనిందర్ సిద్ధూ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా
ఇక మిగతా ముగ్గురు భారత సంతతి నేతలు కూడా ముఖ్యమైన శాఖలకు నియమితులయ్యారు. మనిందర్ సిద్ధూ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రూబీ సహోటా ‘సెక్రటరీ ఆఫ్ క్రైమ్’గా, రణదీప్ సరాయ్ ‘సెక్రటరీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్’గా నియమితులయ్యారు. వీరంతా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం ఉంది. వీరి నియామకం కెనడా రాజకీయాల్లో భారత సంతతి ప్రజల ప్రాధాన్యతను చాటుతోంది.
భారత సంతతికి చెందిన 22మంది ఎంపీలు విజయం
ఇటీవల జరిగిన కెనడా పార్లమెంటరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 22మంది ఎంపీలు విజయం సాధించారు. వీరిలో నలుగురికి క్యాబినెట్ స్థాయి పదవులు లభించడం భారతీయుల రాజకీయ ప్రాభవాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతివారికి ఉన్న ప్రతిభ, విశ్వాసార్హతకు ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది. ఇది ఇతర దేశాల్లో నివసించే భారతీయులకూ స్ఫూర్తిదాయకం.
Read Also : Thalliki Vandanam : జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ