Former MLA Vallabhaneni Vamsi arrested

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌

కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టు కేసు నమోదు..

అమరావతి: వైసీపీ కీలక నేత , గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదయింది. వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది.

image

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు సత్యవర్ధన్ ను కోర్టుకు కారులో తీసుకొచ్చారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ ను వంశీ విశాఖకు పంపించారు.

ఈ క్రమంలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా… కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను కిడ్నాప్ చేసి బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Posts
నారా లోకేష్ రెడ్ బుక్ పై అంబటి కీలక వ్యాఖ్యలు
Ambatiredbook

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నాయకత్వం, ముఖ్యంగా నారా లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనకు సంబంధించిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ.. Read more

మోడీ-రేవంత్ భేటీపై బీఆర్ఎస్ విమర్శలు
Revanth Reddy meets PM Modi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ భేటీపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు ఒకరోజు ముందే ఈ Read more

ట్రంప్ తొలిరోజే 200కు పైగా సంతకాలు!
trump

ప్రపంచ మీడియా అంతా ట్రంప్ ప్రమాణస్వీకారంపై ఫోకస్ చేసింది. ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు వంటి అంశాలపై దృష్టిని సారించింది. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Read more

పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు
పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రిమాండ్ విధించిన కోర్టు, ఆయనను రాజంపేట Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *