తనను వేధించిన డ్రైవర్‌కు చెప్పుతో బుద్ధి చెప్పిన మాజీ సీఎం కుమార్తె

చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన మాజీ సీఎం కుమార్తె

అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ఇంట్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇంటి డ్రైవర్ మద్యం మత్తులో ఆమెను వేధించడంతో, తాను స్వయంగా అతడికి శిక్ష విధించిందని చెబుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సమాజంలో విభిన్న ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన వివరాలు

సోమవారం డిస్పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి మాట ప్రకారం, గత కొన్నేళ్లుగా తన తండ్రి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి తరచుగా మద్యం మత్తులో వస్తూ, దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. అతనిపై అనేకసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ, మార్పు రాలేదని ఆమె తెలిపింది. చివరికి ఈసారి అతడు నేరుగా ఆమె బెడ్‌రూమ్ తలుపులు కొట్టడం ప్రారంభించడంతో, తాను కోపం అణుచుకోలేక అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుందట. వైరల్ అవుతున్న వీడియోలో, డ్రైవర్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి మాజీ సీఎం కుమార్తె చెప్పుతో విచక్షణారహితంగా కొడుతూ కనిపించింది. అతడు తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పినా ఆమె ఆగలేదు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, తప్పుచేసినవారికి సరైన గుణపాఠమే! అంటుండగా, మరికొందరు, దండన విధించే హక్కు పోలీసులకే ఉంది, సదరు మహిళ దౌర్జన్యం చేసింది అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటన డిస్పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్ట్‌హౌస్ లోపల జరిగినట్లు సమాచారం.

పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడానికి కారణం?

ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీరు స్వయంగా దాడి ఎందుకు చేయాలి? అని అడగగా, ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. కానీ మహిళలపైనే సమాజం నింద వేస్తుందని, ప్రతి సమస్యలో కూడా బాధితురాలే తప్పుగా నిలబడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు ఇప్పటివరకు నమోదు కాలేదు. కానీ ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది. న్యాయ నిపుణులు, ఈ ఘటనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవర్ చేసిన తప్పుకు సరైన గుణపాఠమే ఇచ్చింది! ఏదైనా సమస్య ఉంటే, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇలా దాడి చేయడం తగదు మహిళలు ఇలా చేయడం సరైనదేనా? న్యాయం పోలీసుల చేతుల్లో ఉండాలి.ఈ ఘటనపై ఇంకా అధికారిక చర్యలు ఏవీ వెలువడలేదు. అయితే, ఇది మహిళల రక్షణ, స్వీయరక్షణ, చట్టపరమైన చర్యల గురించి కొత్త చర్చను తెరపైకి తీసుకువచ్చింది. ఈ వ్యవహారం మరింత మలుపులు తిరగనుందా? లేదా ఇక్కడితో ముగుస్తుందా? వేచి చూడాల్సిందే. ఇదంతా ఇలా ఉండగా అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంత ఇప్పుడు శాసన సభ్యుడు కాదు. కానీ కుటుంబంతో కలిసి అతడు ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు. మరోవైపు ఈయన అస్సాం రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1985 నుంచి 1990 వరకు తొలిసారి, 1996 నుంచి 2001 మధ్య రెండోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

Related Posts
మహారాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడణవీస్
Devendra Fadnavis to be swo

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర పఢ్నవీస్ పేరు ఖరారైంది. గత పది రోజులుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ కొనసాగింది. ఈ సమయంలో బీజేపీ నాయకులు మరియు శాసనసభ Read more

టర్కీ బాస్ సెలవు తిరస్కరించడంతో వీడియో కాల్‌లో పెళ్లి..
istockphoto 1186214696 612x612 1

పేరుకే వివాహం కానీ వీడియో కాల్‌లో పెళ్లి..టర్కీ బాస్, భారతీయ ఉద్యోగి వివాహ సెలవు తిరస్కరించడంతో వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనేది ఒక Read more

రష్యా-నార్త్ కొరియా సైనిక ఒప్పందం: యుద్ధ సామగ్రి, రక్షణ రాకెట్ల సరఫరా..?
troops north korea

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాకు పంపినప్పటి నుండి, రష్యా కొరియాకు వాయు రక్షణ రాకెట్లు సరఫరా చేసినట్లు దక్షిణ కొరియా Read more

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
Delhi pollution

చలికాలం మొదలుకావడంతో ఢిల్లీలో పొగమంచు రోజు రోజుకు ఎక్కుఅవుతుంది. వాతావరణంలో పెరిగిన కాలుష్యంతో కలిపిన ఈ పొగమంచు పర్యావరణానికి ముప్పును కలిగిస్తోంది. దట్టమైన పొగమంచుతో నగరం నిండిపోవడంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *