YS Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉగాది పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని జగన్ కోరుకున్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ప్రతీ ఇంట్లో ఆయురోగ్యాలు, సిరి సంపదలు, ఆనందాలు నిండాలని ఆక్షాంక్షించారు. రాష్ట్రం సర్వతో ముఖి సుబిక్షంగా ఉండాలని, పల్లెలు, పట్టణాలు కళకళలాడాలని తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్దిల్లాలన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా ఉగాది పండుగను జరుపుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.

ఇది తెలుగు వారి పండుగ
కాగా, ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ.. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు వచ్చింది. సాధారణంగా తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఏ పండుగకు లేని ప్రత్యేకత ఉగాదికి ఉంది. తెలుగు ప్రజలకు ఇది ఒక సరికొత్త సంవత్సరం అనే చెప్పాలి. పూర్వకాలంలో అయితే ఉగాది పండగకు పల్లెటూల్లలో మట్టి గోడలను పూసి.. సున్నం వేసి ఇండ్లను సరికొత్తగా అలంకరించుకునేవారు. ప్రస్తుతం కేవలం పచ్చని తోరణాలు, ఉగాది, పంచాంగం వంటివి పాటిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.