మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్ పూర్ (Narayanpur) ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇటీవలే వాటి గేట్లను ఎత్తివేయడంతో భారీ వరద చేరుకుంటున్నది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు (flood water) ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయానికి నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టి గరిష్ట స్థాయి మట్టం 519.60మీటర్లు, 123.081 టీఎంసీలకుగానూ 517.30, 88.248 టీఎంసీలకు చేరుకున్నది. కాగా ప్రాజెక్టుకు 1,11,472 ఇన్ నమోదు కాగా 1,15,000 అవుట్ నమోదు అయింది.

నారాయణపూర్ జలాశయ స్థితి – జలమట్టం స్వల్పంగా తగ్గుముఖం
నారాయణపూర్ జలాశయం 492.25 మీటర్లు, 33.313 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 490.77, 26.936, జూరాలకు 1,12,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో తో 12గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల190 టీఎంసీలకు చేరుకున్న శ్రీశైలం డ్యాం నమోదైంది. ఇన్ 1,15,000 నమోదు కావడంతో 30గేట్ల ద్వారా 112,577 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. ప్రియదర్శిని జూరాల డ్యాము వరద పెరుగుతున్నది. ఎగువ ప్రాంతం కర్ణాటక (Karnataka) నుంచి వరద (flood water) పోటెత్తడంతో నిండుకుండను తలపిస్తున్నది. దీంతో 12గేట్ల ద్వారా దిగువన శ్రీశైలం జలాశయానికి నీటి విడుదల కొనసాగుతున్నది. సోమవారం జూరాలకు 1,12,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. జూరాల కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం జూరాలలో 7.316 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. పవర్ హౌస్ కు 29,159 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 79,200 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. అదేవిధంగా బీమా లిఫ్టు -1కు 1,300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, ఆర్డీఎస్ కెనాల్ కు 150 క్యూసెక్కులు, ఎడవ కాలువకు 550, క్యూసెక్కులు, కుడి కాలువకు 285 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,10,852 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదయింది.
880అడుగులకు శ్రీశైలం డ్యాం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటున్నది. సోమవారం అందిన సమాచారం మేరకు శ్రీశైలానికి ఇన్ ఫ్లో 1,80,000 క్యూసెక్కులుగా నమోదైంది. అవుట్ ఫ్లో 56 వేలా క్యూసెక్కులుగా ఉన్నది. ఇదే విధంగా డ్యాంకు వరద చేరితే రెండు మూడు రోజుల్లో గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 880 అడుగులకు చేరుకుంది. 216 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసే సామర్థం ఉందీ జలాశయానికి. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోలేదు. ప్రస్తుతం 190టీఎంసీలా మేర నీళ్లు నిల్వ ఉన్నాయి.
పలమూరు ప్రాజెక్టు ఉద్దేశ్యం ఏమిటి?
ఇది మహబూబ్‌నగర్ (పలమూరు) జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ తదితర జిల్లాలకు సాగునీరు మరియు తాగునీరు అందించేందుకు రూపొందించిన భారీ ఎత్తిపోతల పథకం.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్థితి?
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం నెమ్మదిగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మొదటి దశలో కొంత భాగం ప్రారంభించబడినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. ప్రాజెక్టు పూర్తికి 2027 డిసెంబర్ నాటికి గడువు విధించారు, అయితే జాతీయ హోదా, నీటి కేటాయింపులపై ఇంకా అడ్డంకులు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tummala Nageswara Rao: విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు