ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్వహించిన దాడుల్లో పలు బ్రాండ్లకు చెందిన నకిలీ ఉత్పత్తులు బయటపడ్డాయి. ఢిల్లీ బ్రాంచ్‌కు చెందిన BIS బృందం ఇటీవల ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ గోడౌన్‌లో జరిపిన తనిఖీల్లో భారీగా నాణ్యత లేని ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
అమెజాన్ గోడౌన్‌లో 15 గంటల తనిఖీ
ఈ నెల 19న 15 గంటలపాటు కొనసాగిన తనిఖీల్లో గీజర్లు, మిక్సీలు, ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉత్పత్తులపై ISI గుర్తింపు లేకుండా నకిలీ లేబుళ్లతో అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు BIS అధికారులు గుర్తించారు. తనిఖీల్లో బయటపడ్డ విషయాలు- నకిలీ ISI లేబుళ్లు ఉండడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, వేలాది ఉత్పత్తులు వినియోగదారులకు నష్టం కలిగించే విధంగా తయారు చేయబడ్డాయి. ప్రతిష్టాత్మక బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంచారు.

ఫ్లిప్‌కార్ట్ గోడౌన్‌లోనూ నకిలీ ఉత్పత్తులు
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లోనూ BIS తనిఖీలు చేపట్టింది. త్రినగర్ ప్రాంతంలో జరిగిన తనిఖీల్లో నాణ్యత లేని స్పోర్ట్స్ ఫుట్‌వేర్ అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు- 590 జతల నకిలీ స్పోర్ట్స్ షూస్ – ధర సుమారు ₹6 లక్షలు, తయారీ తేదీ లేకపోవడం, ISI ముద్ర లేకపోవడం ప్రధాన కారణాలు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులను అమ్మేందుకు సిద్ధం. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా, గతవారం తమిళనాడులోనూ BIS బృందం 3,000కి పైగా నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. ఈ ఉత్పత్తుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, హోమ్ అప్లయన్స్, కిచెన్ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాయని చెబుతున్నా, ఇలా నకిలీ ఉత్పత్తుల విక్రయాలపై దాడులు జరగడం ఆందోళనకరం. వినియోగదారులు తమ కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. BIS నకిలీ ఉత్పత్తులను విక్రయించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం సూచించిన కీలక నిర్ణయాలు- నకిలీ ఉత్పత్తుల అమ్మకాన్ని నియంత్రించేందుకు స్ట్రిక్ట్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ విధానం E-Commerce ప్లాట్‌ఫార్మ్‌లు నేరుగా BIS ప్రమాణాలను పాటించాలి. తప్పుదారి పట్టే విక్రేతలను వెబ్‌సైట్‌ల నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆదేశం ఈ ఘటన వినియోగదారుల భద్రతకు సంబంధించి కీలక హెచ్చరికగా మారింది. నకిలీ ఉత్పత్తుల సేల్స్‌ను అడ్డుకోవడానికి మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇకపై BIS తనిఖీలు మరింత కఠినంగా కొనసాగే అవకాశముంది. వినియోగదారులు నకిలీ ఉత్పత్తులు కొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.