వేసవి వచ్చిందంటే చాలు… విదేశీ ప్రయాణాలకి డిమాండ్ పెరుగుతుంది.అమెరికా వెళ్లే వారికి టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి.కానీ ఈ సీజన్ మాత్రం అదృష్టాన్ని తెచ్చిందనే చెప్పాలి.ఈసారి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.ముంబై నుంచి అమెరికా వెళ్లే విమాన ధరలు భారీగా తగ్గిపోయాయి.గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసవిలో టికెట్ ధరలు తక్కువగా ఉండడం విశేషం.విడుదలైన తాజా టికెట్ రేట్స్ చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది.మే నెలలో ముంబై నుంచి న్యూయార్క్‌కు వన్ వే టికెట్ కేవలం రూ. 37,000కు లభిస్తోంది.ఇది గతేడాది కంటే చాలా తక్కువ.ఇక రిటర్న్ టికెట్ల విషయంలోనూ మాంచి డీల్స్ దొరుకుతున్నాయి. మధ్యప్రాచ్యంలో లాంగ్ లేఓవర్ ఉన్న విమానానికి ధర రూ.76,000 నుంచే ప్రారంభమవుతోంది.ఇక తక్కువ విరామ సమయంతో వచ్చే కనెక్షన్ ఫ్లైట్ టికెట్ల ధరలు రూ.85,000లోపే లభిస్తున్నాయి.ఏకంగా రూ. లక్షలోపే ప్యాకేజీ మొత్తం ఖర్చు అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు మరింత స్థిరంగా మారుతున్నాయి.ముఖ్యంగా అమెరికా ఎయిర్‌లైన్ కంపెనీలు కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నాయి. డిమాండ్ తగ్గడం, విమానాల లభ్యత పెరగడం టికెట్ ధరలపై ప్రభావం చూపింది.కరోనా అనంతరం మారిన ప్రయాణ ట్రెండ్‌లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అమెరికా వైపు కొన్ని సర్వీసులు తక్కువవ్వడంతో పోటీ తగ్గింది.

కానీ ఈసారి కొన్ని ఎయిర్‌లైన్స్ మరిన్ని ఫ్లైట్లు పెంచాయి. దీంతో ప్రయాణికులకు మరింత అనుకూలంగా మారింది.థామస్ కుక్ (ఇండియా), ఎస్‌ఓటీసి ట్రావెల్ సంస్థలు తెలిపిన ప్రకారం… ఈ వేసవిలో విమాన చార్జీలు 5-8 శాతం తగ్గాయి. గత ఏడాది ముంబై నుంచి న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ వంటి నగరాలకు సగటు ధర రూ. 1.25 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు అదే ప్రయాణానికి రూ. 1.15 లక్షల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవడం మంచిది. లాస్ట్ మినిట్ బుకింగ్‌కు మారితే ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. కనీసం నాలుగు వారాల ముందే టికెట్ బుక్ చేస్తే మంచి డీల్ దొరుకుతుంది.ఇంత చౌకగా అమెరికా ట్రిప్ కోసం ఇదే బెస్ట్ టైం. టికెట్ ధరలు ఈ స్థాయిలో తగ్గడం అరుదే. ఎప్పటికైనా అమెరికా వెళ్లాలని అనుకుంటే… ఇక ఆలస్యం చేయకండి.
Read Also : Donald Trump : ట్రంప్ కు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు : వలసదారులు