ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘నమస్తే వరల్డ్ సేల్’ లో భాగంగా దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్లను కేవలం రూ.1499కే అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తక్కువ ధరలో ప్రయాణించే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఎకానమీ క్లాస్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్లు రూ.3,749 నుండి ప్రారంభమవుతాయి. అలాగే, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.9,999 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ నెల 6వ తేదీ వరకు టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించదు. ఈ ప్రత్యేక రాయితీ ధరలతో ఫిబ్రవరి 12 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రయాణించవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. కాబట్టి, ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ప్రయాణించేందుకు వీలుంటుంది.ఈ ‘నమస్తే వరల్డ్ సేల్’ ద్వారా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం పొందనున్నారు. తక్కువ ధరల్లో ఎయిర్ ఇండియా సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.