fire started again in Los Angeles

లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మొదలైన కార్చిచ్చు..

న్యూయార్క్‌: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఇటీవల చెలరేగిన కార్చిచ్చు మళ్లీ మొదలైంది. తాజాగా మరో ప్రాంతంలో కొత్త మంటలు చెలరేగాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇవి కేవలం కొన్నిగంటల వ్యవధిలోనే 8వేలకు పైగా ఎకరాలకు వ్యాపించినట్లు తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు.

కాస్టాయిక్ లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్దెత్తున మంటలు చెలరేగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్నికీలలు 39 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను, పొదలను బూడిద చేశాయి. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం..ఇటీవల అగ్నికి అహుతైన ఈటన్, పాలిసేడ్స్ కు కేవలం 64కిలోమీరట్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల్లో మంటలు ఇంకా ఆరలేదు. దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి.

image

తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవలి దావానలంలో కాలి బూడిదైన ఈటన్, పాలిసేడ్స్‌కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు. కాగా, ఇటీవల లాస్‌ ఏంజెలెస్‌లోనే చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పాలిసేడ్స్‌లో 68 శాతం, ఈటన‌లో 91 శాతం మంటలను అదుపు చేశారు.

Related Posts
దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఛార్జీలు:జెన్జో అంబులెన్స్
దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఛార్జీలు జెన్జో అంబులెన్స్

దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఛార్జీలు:జెన్జో అంబులెన్స్ దేశవ్యాప్తంగా అత్యవసర ఆరోగ్య సేవలను మరింత వేగంగా అందించేందుకు జెన్జో ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. సాధారణ క్యాబ్ సేవల Read more

గేల్ రికార్డ్ బద్దలుకొట్టిన రోహిత్
rohit records

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన పేలవ బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు Read more

ఎన్నికల్లో ఓటమికి కారణం అదే – జగన్
jagan mohan reddy 696x456

ప్రజల కోసం ఎంతో పని చేసినప్పటికీ తాము గెలవలేకపోవడం బాధ కలిగించింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ Read more

గ్రూప్‌-2 మెయిన్స్‌ యథాతథం : ఏపీపీఎస్సీ
appsc in group 2 mains exams

అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తప్పవంటూ వార్నింగ్ అమరావతి : గ్రూప్-2మెయిన్స్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు Read more