Fire breaks out at Park Hyatt Hotel

Fire Accident : పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావటంతో హోటల్ సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ నుండి ఒక ఫైర్ ఇంజిన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే ఘటన జరిగిన సమయంలో హోటల్ ఆరో అంతస్తులో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు ఉన్నారు. ఆ వెంటనే వారు హోటల్ ఖాళీ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

Advertisements
పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్ని

మొదటి అంతస్తులో విద్యుత్ వైరింగ్‌లో సమస్య

కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని తెలిసింది. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైరింగ్‌లో సమస్య తలెత్తడం వల్ల పొగలు వచ్చాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు కూడా విచారణ చేపట్టారు.

Read Also : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

Related Posts
KTR : వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేస్తా : కేటీఆర్
KTR టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌

KTR : వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేస్తా : కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తాను పాదయాత్రకు సిద్ధమయ్యానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Read more

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త

చార్‌ధామ్ యాత్ర మార్గంలో అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తవాలని ప్రజా పనుల శాఖ మంత్రి పాండే ఆదేశించారు ఈసారి యాత్ర మార్గంలో ప్రతి 10 Read more

భారత్‌లో పర్యటిస్తున్న స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్
Spanish Prime Minister Pedro Sanchez is visiting India

న్యూఢిల్లీ: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్‌లోని గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరానికి సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి అక్కడ రోడ్‌షోలో Read more

ఎలన్ మస్క్‌ను నేపాల్ సందర్శనకు ఆహ్వానించిన ప్రధాని ఓలి..
oli musk

నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సమావేశం ఇద్దరి మధ్య Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×