అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరం

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందరి దృష్టీ నెలకొంది. ఆమె వరుసగా ఎనిమిదో సారి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం. ఈ రికార్డు ఇప్పటికే ఆమె పేరుతో ఉంది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఊరట.. రైతులకు వరాలు.. మహిళలకు లబ్ధి వంటి వరాలు ఉండొచ్చన్న అంచనాలతో సహా పరిశ్రమ వర్గాల నుంచి కూడా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. క్యాలెండర్ ఇయర్‌ను ఆర్థిక సంవత్సరంగా మార్చాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌లోనే దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఎందుకు తెస్తున్నారు.. వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు.. ఏం లాభాలు ఉండొచ్చు.

మన దేశంలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు ఉంటుంది. ఇతర చాలా దేశాల్లో క్యాలెండర్ ఇయర్ అయిన జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న దానినే ఆర్థిక సంవత్సరంగా కూడా పరిగణిస్తున్నాయి. మన దగ్గరే ఇలా క్యాలెండర్ ఇయర్, ఆర్థిక సంవత్సరం వేర్వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. మన దగ్గర కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని కోరుతున్నారు. ఇలా ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్‌కు మార్చినట్లయితే.. పాలనా సామర్థ్యం పెరగడంతో పాటు.. వ్యక్తులకు, వ్యాపారులకు మరింత స్పష్టత కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మల్టీ నేషనల్ కంపెనీలకు (బహుళ జాతి కంపెనీలు), NRI లకు కూడా ఈ విధానం అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంకా క్యాలెండర్ ఇయర్‌కు అనుగుణంగా పన్ను గడువు తేదీలు, ఆర్థిక ప్రణాళికలు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

Related Posts
ఢిల్లీ ఎన్నికలు – జోరుగా బెట్టింగ్ లు
rahul modi kejriwal

చాలా కాలం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా జరుగుతున్నాయి. వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీ నుంచి గట్టి Read more

దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా?
how many companies india

ఇప్పటి వరకు 5,216 విదేశీ కంపెనీలు 2025 జనవరి 31 నాటికి 28 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ దేశంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న Read more

పాస్‌పోర్టుల జాబితాలో దిగజారిన భారత్‌ ర్యాంక్‌
passport

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌ 85వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 80వ స్థానంలో ఉండగా.. ఈ సారి ఐదు స్థానాలు దిగజారింది. వీసా Read more

రాహుల్‌, ఖ‌ర్గేల‌తో మోదీ భేటీ
ambedkhar

అంబేద్క‌ర్ వ‌ల్లే తాము ఇక్క‌డ ఉన్న‌ట్లు మోదీ చెప్పారు. అంబేద్క‌ర్ విజిన్‌ను పూర్తి చేసేందుకు గ‌త ద‌శాబ్ధ కాలం నుంచి త‌మ నిర్విరామంగా కృషి చేస్తున్నామ‌న్నారు. మోడీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *